ఏకంగా నేషనల్ అవార్డు గురి..?
నాచురల్ స్టార్ నాని మరోసారి తన మాస్ విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.
By: Tupaki Desk | 23 July 2025 2:00 AM ISTన్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తర్వాత ప్యారడైజ్ సినిమాతో రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ వదిలిన ప్యారడైజ్ టీజర్ తోనే అంచనాలు తారాస్థాయిలో ఉంచాడు నాని. సినిమాలో నాని ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం ఈ సినిమాలో నాని ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడట.
న్యాచురల్ స్టార్ గా సినిమా సినిమాకు తన వర్సటాలిటీ చూపిస్తున్నాడు నాని. ఈ క్రమంలో అతను ప్యారడైజ్ సినిమాతో పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అర్ధమవుతుంది. ఈసారి అది ఇది కాదు ఏకంగా నేషనల్ అవార్డ్ ని గురి పెట్టి తన క్యారెక్టరైజేషన్ ఫిక్స్ చేసుకున్నాడట నాని. ప్యారడైజ్ లో నాని క్యారక్టరైజేషన్, యాక్టింగ్ అన్నీ కూడా వేరే లెవెల్ లో ఉంటాయట. సినిమా రష్ చూసే నాని సూపర్ హ్యాపీగా ఉన్నాడట.
నాచురల్ స్టార్ నాని మరోసారి తన మాస్ విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను మార్చి ఎండింగ్ కి రిలీజ్ అనుకుంటున్నారు. దాదాపు అనుకున్న విధంగా ఆ డేట్ కే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఐతే నాని సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా కూడా ఇప్పటివరకు హీరోయిన్ ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. దసరా కాంబో కాబట్టి మళ్లీ కీర్తి సురేష్ నే ఇందులో హీరోయిన్ గా తీసుకుంటారా అంటే ఆమె ఆల్రెడీ రౌడీ జనార్ధన్, ఎల్లమ్మ సినిమాలతో బిజీగా ఉంది.
నాని సినిమాలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ త్వరలో క్లియర్ అవుతుంది. ప్యారడైజ్ సినిమాను బాహుబలి రూట్ లోనే భారీ బడ్జెట్ తో పాటుగా రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్ కూడా ఉందని తెలుస్తుంది. నాని కెరీర్ లో హైయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేం కూడా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండాలని చూస్తున్నారు. మరి నాని ఈ సినిమాతో ఏమేరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి. నాని ప్యారడైజ్ కు పోటీగా రాం చరణ్ పెద్ది కూడా వస్తుంది. రెండు సినిమాల్లో ఏది రిలీజ్ అవుతుంది ఏది వాయిదా పడుతుంది అన్నది చూడాలి.
