పదేళ్ల తర్వాత కూడా ఏ విషయంలోనూ రిగ్రెట్ ఉండకూడదు
దానికి నాని రెస్పాండ్ అయి మాట్లాడారు. ఒక విషయం గురించి ఏదొకటి మాట్లాడకుండా ఉన్నందుకు పదేళ్ల తర్వాత కూడా మనం రిగ్రెట్ ఫీల్ అవకూడదని
By: Tupaki Desk | 31 Aug 2025 6:00 PM ISTనేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరిగినా తనదైన గొంతు వినిపిస్తూ, ఆ అంశం గురించి మాట్లాడే హీరోల్లో నాని ఒకరు. గతంలో అలానే పలు విషయాలపై మాట్లాడి వార్తల్లో నిలిచారు నాని. రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో లో పాల్గొన్న నానికి ఈ విషయంపై జగపతి బాబు నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.
జై భీమ్ కు అవార్డు రాకపోవడంతో బాధపడిన నాని
జై భీమ్ సినిమాకు నేషనల్ అవార్డు ఇవ్వనప్పుడు ఆ అంశంపై నాని మాట్లాడిన విషయం తెలిసిందే. జై భీమ్ మూవీకి అవార్డులను పరిగణించకపోవడం తనని నిరాశ పరిచిందని నాని గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల నాని చాలానే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని జగపతి బాబు నానితో డిస్కస్ చేస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చాలా సమస్యలపై నాని మాట్లాడటానికి ట్రై చేస్తారన్నారు.
అందరినీ అప్డేట్ చేయలేను
దానికి నాని రెస్పాండ్ అయి మాట్లాడారు. ఒక విషయం గురించి ఏదొకటి మాట్లాడకుండా ఉన్నందుకు పదేళ్ల తర్వాత కూడా మనం రిగ్రెట్ ఫీల్ అవకూడదని, తన పోస్టులు, అభిప్రాయాల గురించి రెగ్యులర్ గా తాను అందరినీ అప్డేట్ చేస్తూ ఉండలేనని నాని వెల్లడించారు. మనం చిన్నప్పుడు తప్పు చేస్తే విమర్శలు ఎదుర్కొంటామని, మంచి చేస్తే ప్రశంసలు అందుకుంటామని అంటుంటారు. కానీ ఇప్పుడది మారిపోయిందని నాని అన్నారు.
మనమెంత మంచి వాళ్లమైనా, ఎంత మంచి చేసినా సోషల్ మీడియాలో మనపై ఎటాక్, క్రిటిసిజం జరుగుతూనే ఉంటాయని, మనం సోషల్ మీడియాలో ఓ ఫోటో లేదా స్టేట్‌మెంట్ పోస్ట్ చేస్తే, అందులోని అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా మనల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని, వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నదే కాకుండా దాన్ని ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల దాన్ని వేలాది మంది వింటారని, ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ప్రతీసారీ మనం ఏం చెప్తున్నామనేది వివరించలేమని నాని అన్నారు. నాని సమాధానం విన్న తర్వాత జగపతి బాబు ఆశ్చర్యపోయి, అందుకే నానిని హీరో అంటారని అభినందించగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
