నాని టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్స్.. హిట్ 3 నెంబర్ ఎంత?
నాచురల్ స్టార్ నాని మార్కెట్ సినిమా సినిమాకు మరింత పెరుగుతోంది. అతని సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో ఢీకొట్టేలా కలెక్షన్స్ రాబడుతున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 9:47 PM ISTనాచురల్ స్టార్ నాని మార్కెట్ సినిమా సినిమాకు మరింత పెరుగుతోంది. అతని సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో ఢీకొట్టేలా కలెక్షన్స్ రాబడుతున్నాయి. నాని లేటెస్ట్ మూవీ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ ఈ ట్రెండ్‌కు మరో ఉదాహరణ. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.48.5 కోట్లతో మీడియం రేంజ్ హీరోల స్థాయిని చాటుతోంది. ‘హిట్ 3’ మే 1 రిలీజ్ కానుంది. ఇక మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే షాక్ ఇచ్చేలా ఉంది.
‘A’ సర్టిఫికేట్ పొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని యొక్క ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, ట్రైలర్‌లోని సస్పెన్స్ ఎలిమెంట్స్ యూత్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమా నాని కెరీర్‌లో టాప్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ‘హిట్’ ఫ్రాంచైజ్‌లో మూడో చిత్రం. అర్జున్ సర్కార్ IPS పాత్రలో నాని కనిపించనున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే నాని నిర్మాతగా సేఫ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన సినిమాకు ఇక వచ్చేవన్నీ కూడా లాభాలే. ఈ సినిమా ఓపెనింగ్స్ రూ.50 కోట్ల గ్రాస్‌ను అందుకుంటాయని అంచనాలు ఉన్నాయి, ఇది ‘A’ రేటెడ్ సినిమాకు గొప్ప రికార్డ్. నాని గత సినిమాలు కూడా బాగా ఆడాయి. 2024లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ రూ.41 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో మొదటి రోజు రూ.9 కోట్లు వసూలు చేసింది. 2023లో ‘దసరా’ రూ.50 కోట్ల బిజినెస్‌తో నాని కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
‘హాయ్ నాన్న’ రూ.27.6 కోట్ల బిజినెస్‌తో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయింది. ఈ సినిమాలు నాని మార్కెట్‌ను స్టెడీగా పెంచాయి. అంతకుముందు వచ్చిన ‘అంటే సుందరానికి’ (రూ.30 కోట్ల), ‘శ్యామ్ సింగ రాయ్’ (రూ.22 కోట్ల), ‘గ్యాంగ్ లీడర్’ (రూ.28 కోట్ల), ‘జెర్సీ’ (రూ.26 కోట్ల) కూడా నాని స్టార్‌డమ్‌ను నిరూపించాయి. ‘జెర్సీ’ అయితే నాని నటనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలన్నీ కంటెంట్ బలంతో మీడియం రేంజ్ సినిమాలకు కొత్త ఊపు తెచ్చాయి. నాని ఎంచుకునే కథలు, పాత్రలు అతన్ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి.
నాని సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డ్స్
దసరా: 50 కోట్లు
హిట్ 3: 48.5 కోట్లు
సరిపోదా శనివారం: 41 కోట్లు
అంటే సుందరానికి: 30 కోట్లు
గ్యాంగ్ లీడర్: 28 కోట్లు
హాయ్ నాన్న: 27.6 కోట్లు
జెర్సీ: 26 కోట్లు
శ్యామ్ సింగ రాయ్: 22 కోట్లు
