Begin typing your search above and press return to search.

నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ కి రావడమే బెటర్.. ఎందుకంటే..!

అల్లు అర్జున్ కి అవార్డు రావడం వల్ల తెలుగు పరిశ్రమలో ఫెస్టివల్ మూడ్ ఏర్పడింది. సెలబ్రిటీస్ అంతా కూడా పుష్ప రాజ్ ని ఆర్.ఆర్.ఆర్ టీం ని ప్రశంసించారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 10:07 AM GMT
నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ కి రావడమే బెటర్.. ఎందుకంటే..!
X

69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుకి ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి రాం చరణ్, ఎన్.టి.ఆర్ లు కూడా పోటీ పడ్డారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో చరణ్, ఎన్.టి.ఆర్ క్రేజ్ తెచ్చుకున్నారు. హాలీవుడ్ లో గోల్డెన్ గ్లోబల్, హెచ్.సి.ఏ అవార్డులను సైతం అందుకున్నారు. ట్రిపుల్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఆస్కార్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో మన హీరోలు ముగ్గురు పోటీ పడ్డారు. ఫైనల్ గా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూపించిన అభినయానికి అతనికే బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రకటించారు. అల్లు అర్జున్ కి అవార్డు రావడం వల్ల తెలుగు పరిశ్రమలో ఫెస్టివల్ మూడ్ ఏర్పడింది. సెలబ్రిటీస్ అంతా కూడా పుష్ప రాజ్ ని ఆర్.ఆర్.ఆర్ టీం ని ప్రశంసించారు. అయితే అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది కానీ ఇదే ఒకవేళ RRR హీరోల్లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ లలో ఒకరికి వచ్చి ఉంటే సీన్ వేరేలా ఉండేది.

RRR సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాలో నటించిన చరణ్, తారక్ లకు లేని గొడవలు ఫ్యాన్స్ మధ్య వచ్చాయి. సినిమాలో అసలు హీరో చరణ్ సైడ్ హీరో ఎన్.టి.ఆర్ అని మెగా ఫ్యాన్స్.. కాదు అసలు హీరోనే ఎన్.టి.ఆర్ సైడ్ రోల్ చరణ్ అంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవకు దిగారు. ఎంచక్కా ఇద్దరు హీరోలు ఒక పాజిటివ్ నోట్ తో రాజమౌళి మీద నమ్మకం ఉంచి కలిసి సినిమా చేశారు. కానీ హీరోలు ఎలా చేసినా ఫ్యాన్స్ మధ్య మాత్రం ఆ దూరం అలానే ఉండిపోయింది.

ఆస్కార్ అవార్డుల టైంలో కూడా మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య వైరం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్, హెచ్.సి.ఏ అవార్డుల టైం లో కూడా ఫ్యాన్స్ అనవసరమైన హడావిడి చేశారు. నేషనల్ అవార్డుల్లో ఎన్.టి.ఆర్ కి వచ్చి చరణ్ కి రాకపోయినా.. లేదా చరణ్ కి వచ్చి ఎన్.టి.ఆర్ కి ఇవ్వకపోయినా మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగేది. అయితే అవార్డు ఒకవేళ ఇద్దరికి కలిపి ఇచ్చినా కూడా ఫ్యాన్స్ సంతృప్తి పడే అవకాశం లేదు. సో అల్లు అర్జున్ కి అవార్డు రావడం వల్ల ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. మొత్తానికి నేషనల్ అవార్డ్ వల్ల మరోసారి మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య అవార్డుల ప్రస్తావన హాట్ టాపిక్ గా మారేలా చేసింది.