Begin typing your search above and press return to search.

మ‌ల్టీప్లెక్స్ లో 99 రూల‌కే టికెట్! ఎప్పుడో తెలుసా?

అందుకే ఈ ఏడాది కూడా 'నేషనల్ సినిమా డే' జరుపుకోవాలని మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల యాజమాన్యాలు నిర్ణ‌యించాయి.

By:  Tupaki Desk   |   21 Sep 2023 9:51 AM GMT
మ‌ల్టీప్లెక్స్ లో 99 రూల‌కే టికెట్! ఎప్పుడో తెలుసా?
X

గ‌డిచిన నాలుగైదేళ్ల‌లో దేశ వ్యాప్తంగా ఉన్న చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో భారీ మార్పులే చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సినిమాకిప్పుడు హ‌ద్దులు చెరిగిపోయాయి. పాన్ ఇండియాలో అన్ని భాష‌ల సినిమా ల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తు న్నారు. న‌టీన‌టుల‌తో సంబంధం లేకుండా వినోదం ప్రేక్ష‌కుల‌కు చేరుతుంది అన‌డానికి ఇదొక గొప్ప పాజిటివ్ సంకేతం. ఇప్ప‌టి సినిమాకి కావాల్సిందే స్టార్ ఇమేజ్ కాదు...కేవ‌లం బ‌ల‌మైన క‌థ మాత్ర‌మేన‌ని ఎన్నో సినిమాలు నిరూపించాయి.

సినిమా వీక్షించ‌డానికి అనేక మార్గాలున్నా! థియేట‌ర్లో సినిమా చూసిన అనుభూతి ఎక్క‌డ దొరుకుతుంది? అది కేవ‌లం థియేట‌ర్ ఆస్వాద‌న‌కే సొంతం. అయితే మ‌ల్టీప్లెక్స్ సినిమా మాత్రం సామాన్యుడికి భారమైన విష‌య‌మే. పెరిగిన ధ‌ర‌ల‌తో మ‌ల్టీప్లెక్స్ కి వ‌చ్చి సినిమా చూడ‌టం అన్న‌ది త‌ల‌కు మించిన భార‌మే. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా లవర్స్‌కు మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఒక బంపపరాఫర్ ప్ర‌క‌టించింది. 'నేష‌న‌ల్ సినిమా డే'ని పుర‌స్క‌రించుకుని రూ.99లకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశాన్ని క‌ల్పిస్తుంది.

కోవిడ్ స‌మ‌యంలో జ‌నాలు థియేట‌ర్ కి రాక‌పోవ‌డంతో మ‌ల్టీప్లెక్స్ అసోసియ‌న‌ష్ ఆఫ్ ఇండియా అక్టోబ‌ర్ 13 నేష‌న‌ల్ సినిమా డేని వెలుగులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈరోజున దేశవ్యాప్తంగా పలు మల్టీప్లెక్స్‌లతో పాటు ఎంపిక చేసిన థియేటర్లలో అన్ని సినిమాల టిక్కెట్‌లను తక్కువ ధరకు విక్రయించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ ఏడాది కూడా 'నేషనల్ సినిమా డే' జరుపుకోవాలని మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల యాజమాన్యాలు నిర్ణ‌యించాయి. దీనికి వేగంగా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

పీవీఆర్..ఐనాక్స్.. సినీ పోలీస్.. సిటీ ప్రైడ్..ఏషియ‌న్...మూవీ టోన్ వంటి మ‌ల్టీప్లెక్స్ లు ఈ వేడుక‌లో పాల్గోంటున్నాయి. దీనిలో భాగంగా అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా అన్ని సినిమాల టిక్కెట్లు కేవలం 99 రూపాయలకే అందుబాటులో ఉంటాయి. ఆ ఒక్క రోజు స్నాక్స్... బేవ‌రేజేస్ ధరలు కూడా త‌గ్గుతాయి. ఆ తేదీకి ముందు..ఆ తేదీ రోజున రిలీజ్ అయ్యే సినిమాల‌కు ఈ డే బాగా క‌లిసొస్తుంది. జ‌నాల‌కు మ‌ల్టీప్లెక్స్ అనుభూతి పంచ‌డంతో పాటు... ప్రేక్ష‌కుల‌కు మ‌ల్టీప్లెక్స్ అల‌వాటు చేయాల‌న్న‌ది ఎమ్ ఏ ఐ బిజినెస్ స్ట్రాట‌జీ. గ‌తేడాది బాగానే వ‌ర్కౌట్ అయింది. మ‌రి ఈసారి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.