Begin typing your search above and press return to search.

నేషనల్ అవార్డ్స్​.. ఆలోచన విధానం మారుతోంది!

జైభీమ్​ లాంటి సోషల్​ మెసేజ్​ పాత్రలను పక్కనపెట్టి.. స్మగ్లర్ పాత్రకు పెద్దపీట వేయడం ఏంటి? అవార్డ్ ఇవ్వడం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2023 7:31 AM GMT
నేషనల్ అవార్డ్స్​.. ఆలోచన విధానం మారుతోంది!
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ అవార్డు కోసమే ఎంతో మంది సినిమా వాళ్లు ఆరాటపడుతుంటారు. దానిని అందుకోవాలని ఆశిస్తుంటారు. కానీ అది అంత ఈజీగా రాదు. అది అందుకోవాలంటే కొన్ని ప్రామాణికలు ఉంటాయి. ఈ నేషనల్ అవార్డ్స్​ జ్యూరీ సభ్యుల ఆలోచన తీరు కూడా వేరుగా ఉంటుంది.

మంచి సందేశంతో కూడిన కంటెంట్​, కథా బలమున్న సినిమాలకు, ఆడియెన్స్​పై చెడు ప్రభావం చూపని వంటికి ఇచ్చేవారు. అలాగే ఉత్తమ నటుడు, నటి అవార్డులను కూడా వారు నటించిన ఆయా పాత్రల్లోని ఔన్నత్యం చూసి ప్రకటించేవారు. సానుకూల లక్షణాలున్న పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. నెగెటివ్ షేడ్స్, అలాగే ఆడియెన్స్​పై ప్రతికూల ప్రభావం చూపే పాత్రల వైపు వీళ్లైనంత వరకు మొగ్గు చూపేవారు కాదు. కమర్షియల్ సినిమాలను పరిగణనలోకి ఎక్కువ తీసుకునేవాళ్లు కాదు.

దీంతో అవార్డు సినిమాలు, పాత్రలు అంటే.. ఓ ప్రత్యేక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే గత కొన్నేళ్లుగా పరిస్థితి మారుతోంది. 'బాహుబలి' చిత్రానికి బెస్ట్ మూవీగా నేషనల్​ అవార్డు వచ్చినపుడు ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయారు.

భారీ రేంజ్​లో సక్సెస్ చూసి పురస్కారాన్ని అందించారని విమర్శలు గుప్పించారు. ఏదేమైనప్పటికీ.. ఇప్పుడూ జ్యూరీ సభ్యుల మైండ్ సెట్ మారుతోందని అర్థమవుతోంది. వారి ఆలోచన విధానం కొత్త పుంతలు తొక్కుతోంది.

'పుష్ప' సినిమాలో బెస్ట్ యాక్టర్​గా జాతీయ అవార్డును అల్లుఅర్జున్​కు, మ్యూజిక్​ డైరక్టర్​ దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు ప్రకటించడం షాక్​కు గురి చేసింది. జైభీమ్​ లాంటి సోషల్​ మెసేజ్​ పాత్రలను పక్కనపెట్టి.. స్మగ్లర్ పాత్రకు పెద్దపీట వేయడం ఏంటి? అవార్డ్ ఇవ్వడం ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

ఆర్ఆర్ఆర్​ నేపథ్య సంగీతం విషయంలోనూ ఇలానే అంటున్నారు. ఉప్పెనను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక చేయడంలో కొందరికి అభ్యంతరాలున్నాయి. ఏది ఏమైనా.. ఇప్పుడు జ్యూరీ సభ్యులు ఒక గిరి గీసుకుని కూర్చోలేదని స్పష్టమవుతోంది. పాజిటివ్, నెగటివ్​, కమర్షియల్​, కంటెంట్​, చిన్నదా, పెద్దదా అని వ్యత్యాసాలు లేకుండా అవార్డులను ప్రకటిస్తున్నారు.