Begin typing your search above and press return to search.

షాకిస్తున్న స్టార్ క్రికెట‌ర్ వైఫ్ బికినీ ఫెస్టివ‌ల్

నటాషా తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో నడుము బెల్ట్‌తో పాటు అద్భుతమైన బ్లాక్ బికినీలో పోజులిచ్చింది.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:19 PM GMT
షాకిస్తున్న స్టార్ క్రికెట‌ర్ వైఫ్ బికినీ ఫెస్టివ‌ల్
X

న‌టి, న‌ర్త‌కి న‌టాషా స్టాంకోవిక్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా భార్య‌గా సుప‌రిచితురాలు. మోడ‌ల్ కం న‌టి స్టాంకోవిక్ ని హార్థిక్ ఘాడంగా ప్రేమించి పెళ్లాడాడు. ఇటీవ‌ల ఈ జంట‌కు ఒక బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఇక స్టాంకోవిక్ కి సోష‌ల్ మీడియాల్లోను అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. క్రికెట్ అభిమానులనే కాకుండా సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను కూడా కొల్లగొట్టిన నటాసా స్టాంకోవిక్ తో ల‌వ్ లైఫ్ కి సంబంధించిన ఫోటోల‌ను హార్థిక్ రెగ్యుల‌ర్ గా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు రెండు అంద‌మైన ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసాడు. ఈ ఫోటోల్లో న‌టాషా బికినీ లుక్ అమాంతం వేడి పెంచింది.


నిజానికి న‌టాషాకు బికినీ కొత్తేమీ కాదు కానీ పెళ్ల‌యాక కూడా ఈ బ్యూటీ ఎక్క‌డా త‌గ్గ‌క‌పోవ‌డంపైనే యూత్ రక‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. నటాషా తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో నడుము బెల్ట్‌తో పాటు అద్భుతమైన బ్లాక్ బికినీలో పోజులిచ్చింది. సముద్రం ఎదుట అందంగా పోజులిచ్చింది. సన్ గ్లాసెస్ ధ‌రించి మినిమల్ మేకప్‌తో మెరిపించింది.

ఉన్న‌ట్టుండి బ్లాక్ బికినీలో ప్ర‌త్య‌క్ష‌మైన మ్యారీడ్ బ్యూటీని చూసి అభిమానులు ప‌రేషాన్ అవుతున్నారు. న‌టాషా ఒంపుసొంపుల ఖిల్లా గురించి చాలా విస్త్ర‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. అభిమానులు ఫైర్ - హార్ట్ ఎమోజీలతో వ్యాఖ్యలను జోడిస్తున్నారు. ఇంతందం ఇల‌లో లేనే లేదు! అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

వార‌సుడికి మొద‌టి పుట్టిన‌రోజు

విదేశీ అంద‌గ‌త్తె నటాసా స్టాంకోవిక్ ని పెళ్లాడ‌క ముందు అందాల క‌థానాయిక‌ ఈవ్ లిన్ శ‌ర్మ‌తో హార్థిక్ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈవ్ లిన్ తో స్నేహం కొన‌సాగిస్తూనే న‌టాషాతోను అత‌డు ప్రేమాయ‌ణం సాగించాడ‌ని ప్రచార‌మైంది. వ‌న్ ఫైన్ డే న‌టాషా ని అత‌డు సైలెంటుగా పెళ్లాడాడు. ఇప్పుడు ఒక వార‌సునికి వీరు దంప‌తులు. కుమారుడి పేరు అగస్త్య పాండ్య‌. ఇటీవ‌లే మొద‌టి పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు.