ఫోటో స్టోరి: బిడ్డ తల్లి అయినా సమ్మోహనమే
హార్థిక్ పాండ్యా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నటాషా స్టాంకోవిక్ పూర్తి స్వేచ్ఛా జీవిగా మారింది. మునుపటితో పోలిస్తే ఎంతో ఆనందంగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 14 April 2025 7:00 PM ISTహార్థిక్ పాండ్యా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నటాషా స్టాంకోవిక్ పూర్తి స్వేచ్ఛా జీవిగా మారింది. మునుపటితో పోలిస్తే ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. మబ్బు విడిపోయి వాన వెలిసాక కనిపించే ఆహ్లాదకరమైన ఠీవి ఆమెలో కనిపిస్తోంది. ఇటీవల వరుసగా బికినీలు, మోనోకినీల్లో మెరిసిన నటాషా స్విమ్ సూట్లతో పూల్ సైడ్ ట్రీట్ ని ఇచ్చింది.
తాజాగా మరోసారి స్పెషల్ మినీ ఫ్రాకులో దర్శనమిచ్చింది ఈ భామ. థై అందాలను ప్రదర్శిస్తూ తనలో వాడి వేడి ఎంతమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. అసలు ఈమె బిడ్డ తల్లేనా? అని సందేహించేంత బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. నటాషా తదుపరి సినిమాలకు సంతకాలు చేసేందుకు రెడీ అవుతోంది. బుల్లితెరపైనా వెలుగులు వెలిగేందుకు, మోడలింగ్ కెరీర్ ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందని బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. నటాషా ఈ మినీ లుక్ లో చాలా స్పెషల్ గా ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. నటిగా బిజీ అవ్వాలని కూడా ఫ్యాన్స్ తనను ఎంకరేజ్ చేస్తూ సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. ఈ ఉత్సాహంలో నటాషా అనుకున్నది సాధించుకుంటుందేమో చూడాలి.
