గోవా బీచ్‌లో నటాషా చిల్లింగ్
నటాషా స్టాంకోవిక్ పరిచయం అవసరం లేదు. ఇటీవల రెగ్యులర్ గా మీడియా హెడ్‌లైన్స్ లో నిలిచింది ఈ పేరు.
By: Tupaki Desk | 8 April 2025 10:46 PM ISTనటాషా స్టాంకోవిక్ పరిచయం అవసరం లేదు. ఇటీవల రెగ్యులర్ గా మీడియా హెడ్‌లైన్స్ లో నిలిచింది ఈ పేరు. ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యా నుంచి బ్రేకప్ అయిన క్రమంలో నటాషా పేరు మార్మోగింది. ఎదుగుతున్న కుమారుడు అగస్త్య పాండ్యతో కలిసి ఎక్కువ సమయం గడుపుతున్న నటాషా విహారయాత్రల నుంచి వరుస ఫోటోలను షేర్ చేస్తోంది.
తాజాగా గోవా బీచ్ లో స్వేచ్ఛగా ఆస్వాధిస్తున్న ఫోటోలను నటాషా స్టాంకోవిక్ షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో నటాషా తన స్నేహితులతో ఫుల్ గా చిల్ అవుతోంది. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో తలమునకలుగా ఉన్న నటాషా స్విమ్ సూట్ ట్రీట్ తోను రంజింపజేసింది. మరోవైపు కుమారుడు అగస్త్య తో కలిసి పూల్ లో ఈత కొడుతూ కనిపించింది. అగస్త్యకు ఈత కూడా నేర్పిస్తోంది నటాషా.
తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఆఫ్టర్ బ్రేకప్ నటాషా ఫుల్ గా స్వేచ్ఛా జీవనాన్ని ఆస్వాధిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బ్యూటీ తదుపరి తన నటనా కెరీర్ ని పునరుద్ధరించే పనిలో ఉంది. ఇప్పటికే బుల్లితెర వెండితెర ప్రయత్నాలను ప్రారంభించిందని సమాచారం.
