పాండ్య కొడుకుని ముద్దు చేసిన నటాషా బోయ్ ఫ్రెండ్
హార్థిక్ పాండ్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నటాషా స్టాంకోవిక్ పూర్తి స్వేచ్ఛను ఆస్వాధిస్తున్న ఫోటోల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 15 April 2025 9:31 AM ISTహార్థిక్ పాండ్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నటాషా స్టాంకోవిక్ పూర్తి స్వేచ్ఛను ఆస్వాధిస్తున్న ఫోటోల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమాల్లో నటించాలన్న తన ఆసక్తిని సెర్బియన్ బ్యూటీ నటాషా బహిరంగంగా వెల్లడించింది. తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్లో తన మనసులోని కోరికలు, ఆకాంక్షలను బయటపెట్టింది.
అయితే ఇదే ఫ్యాషన్ ఈవెంట్‌లో నటాషా- హార్థిక్ జంట కుమారుడు చిన్నారి అగస్త్య పాండ్య ముందు వరుసలో కూచుని కనిపించాడు. అయితే ఇలాంటి ఈవెంట్లకు ఇంత చిన్న వయసు కుర్రాడిని తీసుకురావడం సరికాదంటూ నెటిజనులు నటాషాపై ట్రోల్స్ చేసారు. పైగా అగస్త్య పాండ్య పక్కనే కూచుని ఉన్న నటాషా స్నేహితుడు, ఫిట్ నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ అతడిని ఆప్యాయంగా ముద్దాడుతూ కనిపించాడు. అయితే ఇది హార్థిక్ పాండ్య అభిమానులకు రుచించలేదు. బోయ్ ఫ్రెండ్ అలెక్స్ తో పాటు నటాషాను తిట్టడం ప్రారంభించారు.
అయితే ఆ ఇద్దరూ కజిన్స్ అని, సెర్బియా మోడల్ కం నటి నటాషాకు అలెక్స్ సోదరుడి వరస అని ఒక నెటిజన్ వివరించే ప్రయత్నం చేసాడు. ప్రస్తుతం అగస్త్య పాండ్య తలపై అలెక్స్ ఇలిక్ ముద్దులు పెడుతున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నటాషా- అలెగ్జాండర్ డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాల నడుమ ఇది చాలామందికి నచ్చలేదు. అయినా పిల్లలను ఇలాంటి ఈవెంట్‌లకు ఎందుకు తీసుకురావాలి? తల్లి ర్యాంప్ వాక్ చేస్తే చూడాలనా? ఆ పిల్లవాడికి ఏమీ తెలియని వయసు కదా.. ఇది కరెక్టేనా? అని ఒక నెటిజన్ ట్రోల్ చేసారు. నటాషా కొడుకు వయస్సు ఇలాంటి ఈవెంట్లకు తగినది కాదు! అని మరొక నెటిజన్ విమర్శించారు. అయితే తనయుడిని బాగా చూసుకుంటుందని, తన వెంటే తిప్పుతోందని చాలామంది నటాషాకు మద్దతుగా నిలిచారు.
నటాషా స్టాంకోవిక్- క్రికెటర్ హార్దిక్ పాండ్యా జూలై 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట బ్రేకప్ అధికారికమైంది. ఆ తర్వాత నటాషా కొంతకాలం సెర్బియా వెళ్లిపోయి తిరిగి ముంబైకి వచ్చారు. ప్రస్తుతం ఈ జంట అగస్త్యకు సహ తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. ఇటీవల ఫిట్నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో ఉన్నప్పటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాల్లో నటాషా షేర్ చేయగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.