Begin typing your search above and press return to search.

'టైగర్ నాగేశ్వరరావు'... స్టువర్ట్​పురం బ్యాక్​బోన్​ ఈయనే

గజ్జల ప్రసాద్​గా పరిచయం చేస్తూ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ది బ్యాక్​ బోన్​ ఆఫ్​ స్టువర్ట్​పరం అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ట్రైలర్​ అక్టోబర్​ 3న రిలీజ్​ కాబోతున్నట్లు తెలిపింది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 7:53 AM GMT
టైగర్ నాగేశ్వరరావు... స్టువర్ట్​పురం బ్యాక్​బోన్​ ఈయనే
X

మాస్​ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్ నాగేశ్వరరావు'. రవితేజ కెరీర్​లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని సినిమాను తెరకెక్కించారు. ప్రమోషన్స్ కూడా అంతే జోరుగా చేస్తున్నారు. వరుసగా ఏదో ఒక అప్డేట్​ను రెగ్యులర్​గా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, టీజర్, సాంగ్స్​ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.


నిన్న సినిమాలోని రేణు దేశాయ్​ లుక్​ను హేమలతగా పరిచయం చేస్తూ విడుదల చేయగా.. తాజాగా సినిమాలోని నాజర్​ లుక్​ను విడుదల చేశారు. గజ్జల ప్రసాద్​గా పరిచయం చేస్తూ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ది బ్యాక్​ బోన్​ ఆఫ్​ స్టువర్ట్​పరం అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ట్రైలర్​ అక్టోబర్​ 3న రిలీజ్​ కాబోతున్నట్లు తెలిపింది. ముంబయిలో గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్​ నిర్వహించబోతున్నట్లు గుర్తుచేసింది.

డస్కీ కలర్​లో ఈ కొత్త పోస్టర్​ను డిజైన్ చేశారు. ఇందులో పొడవాటి జట్టు, పెద్ద మీసాలతో నాజర్ వేషధారణ ఇంట్రెస్ట్​ను క్రియేట్​ చేస్తోంది. ఇంకా ఓ పోస్టర్​లో ఆయన చుట్ట తాగుతూ కనిపించారు. ప్రస్తుతం ఇది సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇకపోతే ఈ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. 70వ దశకంలో స్టూవర్ట్ పురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రంలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథనాయికలుగా కనిపించనున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్​పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.