ప్రేమలు 'నజ్లెన్' కొత్త మూవీ.. తెలుగులో ఏం చేస్తుందో..
రీసెంట్ గా అలప్పుజ జింఖానా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
By: Tupaki Desk | 18 April 2025 1:34 PM ISTమాలీవుడ్ మూవీ ప్రేమలు.. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మలయాళంలో తొలుత రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవ్వగా.. ఆ తర్వాత తెలుగులో కూడా అలరించింది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టి అటు మాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లో సత్తా చాటింది.
అయితే ఆ సినిమాతో రెండు ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకున్న నజ్లెన్.. రీసెంట్ గా అలప్పుజ జింఖానా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు.. 2025లో ఇప్పటి వరకు రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఘనత సాధించి దూసుకుపోతోంది.
యూత్ ఫుల్ థీమ్, ఫ్రెండ్ షిప్, చిన్నపాటి గొడవలు వంటి పలు అంశాలతో ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా... జెన్ జెడ్ వాళ్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఆ యాక్షన్ ఎంటర్టైనర్.. తెలుగులో కూడా సందడి చేయనుంది. ఏప్రిల్ 25వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.
అయితే ఇప్పటికే జింఖానా మూవీపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుండగా.. తెలుగు వెర్షన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరో మాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టాలీవుడ్ వెర్షన్ లోడింగ్ అని సందడి చేస్తున్నారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అంటున్నారు.
ఇక జింఖానా మూవీ విషయానికొస్తే.. లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ కీలక పాత్రలు పోషించారు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్ , రియలిస్టిక్ స్టూడియోస్ గ్రాండ్ గా నిర్మించగా.. విష్ణు విజయ్ మ్యూజిక్ అందించారు. జిమ్షి ఖలీద్ డీవోపీ బాధ్యతలు పర్యవేక్షించారు. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.
అయితే ఇప్పటికే ఎన్నో మాలీవుడ్ సినిమాలు.. తెలుగులో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నెజ్లెన్ యాక్ట్ చేసిన ప్రేమలు సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. కంటెంట్ ఉండాలే కానీ సినీ ప్రియులు బ్రహ్మరథం పడతారు. మరి జింఖానా మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
