Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప లను చివరి వరకు చూడలేక పోయా...!

ఈ రెండు సినిమాలు సౌత్ ఇండియన్ సినిమాలు అయినప్పటికీ నార్త్ ఇండియాలో ఎక్కువ మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాయి

By:  Tupaki Desk   |   27 Sep 2023 6:40 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప లను చివరి వరకు చూడలేక పోయా...!
X

ఈ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా మరియు అత్యధిక జనాలు చూసిన చిత్రాలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మరియు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ రెండు సినిమాలు సౌత్ ఇండియన్ సినిమాలు అయినప్పటికీ నార్త్ ఇండియాలో ఎక్కువ మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అక్కడ భారీగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఈ రెండు సినిమాలను చూడలేదని తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ రెండు సినిమాలను చూసేందుకు ప్రయత్నించానని.. కానీ మధ్యలోనే చూడలేక ఆపేశాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది ఆడవారు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు.

బాలీవుడ్ వారు సౌత్ సినిమాలను చిన్న చూపు చూడడం కొత్తేమీ కాదు.. ఈ సీనియర్ నటుడు కూడా సౌత్ సినిమాలపై చిన్న చూపుతోనే మన గొప్ప చిత్రాలను అవమానించాడు అంటూ కొందరు తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.

ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న ఈ రెండు సినిమాల గురించి ఒక సీనియర్ నటుడు అయ్యుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదని సోషల్ మీడియాలో ఆయనను ఉద్దేశించి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ రెండు తెలుగు సినిమాలు నచ్చని నసీరుద్దీన్ షా కి తమిళ్ మూవీ పొనియన్ సెల్వన్‌ బాగా నచ్చిందట. ఆ సినిమా పై ఈ నటుడు ప్రశంసలు కురిపించడం ఇక్కడ కోసమెరుపు.