Begin typing your search above and press return to search.

ఫస్ట్ బొమ్మ పడకుండానే 4 సినిమాలు

వాటిలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒకటి, గీతా ఆర్ట్స్ 2 లో ఒక మూవీ, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:58 AM GMT
ఫస్ట్ బొమ్మ పడకుండానే 4 సినిమాలు
X

కొంతమంది హీరోలు తెరంగేట్రంతోనే వరుస అవకాశాలు అందుకుంటారు. తమ సత్తా చాటడానికి సిద్ధమవుతారు. అలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అనే బ్రాండింగ్ తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న మరో యంగ్ హీరో నార్నె నితిన్. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి తమ్ముడైన ఈ కుర్రాడు. ఇప్పటికే యాక్టర్ గా సక్సెస్ కావడానికి కావాల్సిన అన్ని మెళుకువలు నేర్చుకొని తెరంగేట్రం చేయబోతున్నాడు.

మొదటి సినిమాని సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమా గత ఏడాది స్టార్ట్ చేశారు. ఆ సినిమా మా నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. మాస్ లుక్ లో గెడ్డంతో నితిన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. తరువాత మూవీ గురించి ఎలాంటి టాక్ బయటకి రాలేదు. షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని అంటున్న రిలీజ్ పై క్లారిటీ లేదు. అయితే మొదటి సినిమా పడకుండానే ఈ యంగ్ హీరోతో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు చేసేందుకు ముందుకొచ్చాయి.

వాటిలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒకటి, గీతా ఆర్ట్స్ 2 లో ఒక మూవీ, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇలా టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు గా ఉన్న మూడింటిలో సినిమాలు చేయడానికి నార్నె నితిన్ ఇప్పటికే కమిటయ్యారు. ఇప్పుడు మరో పెద్ద బ్యానర్ లో నాలుగో మూవీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. అయితే అఫీషియల్ ఏ బ్యానర్ అనేది క్లారిటీ లేదు.

కానీ భారీ బడ్జెట్ తోనే ఈ మూవీని ప్లాన్ చేయబోతున్నారంట. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అనే బ్రాండ్ తో నార్నె నితిన్ బడా ప్రొడక్షన్స్ లో మూవీస్ చేసే ఛాన్స్ అయితే దక్కించుకున్నాడు. అయితే ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. నితిన్ హీరోగా పరిచయం కావడానికి తండ్రి నార్నె శ్రీనివాస్ సపోర్ట్ కూడా బలంగా ఉందనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్ లో నితిన్ పేరుతో సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగిస్తున్న హీరో ఉన్నాడు. మరి నార్నె నితిన్ కూడా అదే పేరుతో కొనసాగుతాడా లేదంటే పేరు మార్చుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.