Begin typing your search above and press return to search.

అల్లు బ్యానర్ లో నార్నే హీరో..!

నార్నే నితిన్ రెండో సినిమా సోలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 12:30 PM GMT
అల్లు బ్యానర్ లో నార్నే హీరో..!
X

ఎన్.టి.ఆర్ బ్రదర్ ఇన్ లా నార్నే నితిన్ రీసెంట్ గా మ్యాడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సితార బ్యానర్ నుంచి రావడం వల్ల సినిమా మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా విషయంలో నార్నే నితిన్ పర్వాలేదు అనిపించాడు. మ్యాడ్ లో అతను ఒక హీరోగా కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే అనిపించాడు.

ఎన్.టి.ఆర్ బామ్మర్ది అన్న అనవసర ఎలివేషన్స్ ఏమి లేవు. సినిమాలో అతని కన్నా సంగీత్ శోభన్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. అతని కామెడీ టైమింగ్ అంతా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. నితిన్ కి కూడా నటించే స్కోప్ ఉన్నా మొదటి సినిమా కాబట్టి కాస్త తడబడ్డాడు. మ్యాడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చింది ఓకే అనిపించుకుంది. అయితే నెక్స్ట్ సినిమాకు మాత్రం నితిన్ ఫుల్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది.

నార్నే నితిన్ రెండో సినిమా సోలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. గీతా ఆర్ట్స్ 2 సినిమా అంటే కచ్చితంగా సినిమా మీద హోప్ పెట్టుకునే అవకాశం ఉంది. నార్నే నితిన్ కూడా రెండో సినిమాకు కొంత హోం వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారా.

ఎంత ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నా కూడా నితిన్ తన టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. మ్యాడ్ సినిమా ఎలాగోలా అతన్ని మొదటి టెస్ట్ పాస్ అయ్యేలా చేయగా రెండో సినిమా మాత్రం తన సత్తా చాటాల్సి ఉంటుంది. నితిన్ గీతా ఆర్ట్స్ 2 ఈ కాంబో ప్రేక్షకులకు ఎలాంటి మూవీని అందిస్తుందో చూడాలి. నార్నే నితిన్ సినిమా కెరీర్ అతని బావ ఇమేజ్ కాదు తను కష్టపడడం లో ఉంటుంది.

మ్యాడ్ సినిమా లో జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకుని రాబోయే సినిమాలో అవి లేకుండా చూసుకుంటే నితిన్ హీరోగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే కథల ఎంపికలో కూడా తన క్లవర్ నెస్ చూపించాల్సి ఉంటుంది. మంచి కథ దొరికితే నటన కాస్త అటు ఇటుగా ఉన్నా సినిమా కంటెంట్ బేస్ మీద ప్రేక్షకులను అలరిస్తాయి.