Begin typing your search above and press return to search.

మంతెన ఫాస్టింగ్ నే మించి చేస్తోందే!

ఉప‌వాసం ఎవ‌రైనా ఒక రోజు చేస్తారు లేదా రెండు రోజులు. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూర్చున్న వాళ్లు అయితే వారం రోజులు.

By:  Tupaki Desk   |   7 July 2025 3:00 AM IST
మంతెన ఫాస్టింగ్ నే మించి చేస్తోందే!
X

ఉప‌వాసం ఎవ‌రైనా ఒక రోజు చేస్తారు లేదా రెండు రోజులు. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూర్చున్న వాళ్లు అయితే వారం రోజులు. ఈలొగో డిమాండ్లు నెర‌వేర‌డ‌మా? దీక్ష‌ను భ‌గ్నం చేయ‌డమా? ఏదో ఒక‌టి జ‌రు గుతుంది. బ‌రువు త‌గ్గాల‌ని ఉపాసం చేయాల‌నుకున్న వాళ్లైతే మంతెన స‌త్యానార‌య‌ణ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి చేస్తుంటారు. అదీ కూడా వారం రోజుల పాటే. ఆ వారం రోజులు కూడా ఖాళీ క‌డుపుతో కాకుండా తెనే -నిమ్మ‌రం జ్యూస్ తో తీసుకుంటారు.

మ‌ధ్య మ‌ధ్య‌లో నీళ్లు తీసుకోవ‌డం జ‌రుగుతుంది. ఇనిస్టెంట్ గా బ‌రువు త‌గ్గాల‌నుకున్న వాళ్లు ఈ ర‌కంగా చేస్తుంటారు. అదీ వారం మించ‌కుండా? అయితే బాలీవుడ్ బ్యూటీ న‌ర్గీస్ ఫక్రీ సంవ‌త్స‌రంలో ఏకంగా 18 రోజులు కేవ‌లం నీళ్ల‌తోనే ఉప‌వాసం చేస్తుంద‌ని ఎంత మందికి తెలుసు. అవును రెండు కాదు...నాలుగు కాదు...ఆరు కాదు ఏకంగా తొమ్మిది రోజుల పాటు కేవ‌లం నీళ్ల‌మీద‌నే ఉంటుంది.

ఇలా ఏడాదికి రెండుసార్లు చేస్తోందిట‌. ఏక‌ధాటిగా తొమ్మిది రోజుల పాటు నీళ్లే ఆహారంగా జీవిస్తుందిట‌. ఇంకెలాంటి పుడ్ తీసుకోదు. ఇలా చేయ‌డం చాలా క‌ష్టంగా ఉంటుందంది. ఈ స‌మ‌యంలో ముఖం వికృతిగా మారిపోతుంది. ద‌వ‌డ‌లు లాగేస్తాయి. శ‌రీరంలో ఉన్న కొవ్వు అంతా క‌రిగిపోతుంది. ఓకొత్త రూపంలో కి వ‌చ్చేస్తాం. కానీ ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. ఇది తానెంతో ఇష్ట‌ప‌డి చేసే ఉపవాసం అంటోంది.

ఇలా చేయ‌డంలో వ‌ల్ల బాడీలో ఎన్నో మార్పులు జ‌రిగి ఆరోగ్యంగా ఉంటామంది. అలాగ‌ని అంద‌ర్నీ త‌నలా మాత్రం చేయోద్దు అంటోంది. నిపుణుల స‌మ‌క్షంలోనే ఇలాంటివి చేయాల‌ని సూచించింది. గ‌తంలో వాట‌ర్ పాస్టింగ్ గురించి ఓ తెలుగు నిర్మాత కూడా ఇలాగే చెప్పారు. మ‌నిషి కొన్ని రోజుల పాటు కేవ‌లం వాట‌ర్ పాస్టింగ్ మీద జీవనం గ‌డపొచ్చ‌ని సూచించారు. కానీ దానికి ఎంతో ప‌ట్టుద‌ల ఉండాల‌న్నారు.