Begin typing your search above and press return to search.

2000 కోట్ల డ్ర‌గ్ డాన్ కం నిర్మాత‌ కోసం NCB సెర్చ్

కేవలం మూడేళ్లలో దాదాపు రూ. 2000 కోట్లు సంపాదించిన డ్రగ్స్ రాకెట్‌కు సూత్రధారి అయిన‌ తమిళ సినీ నిర్మాత కం డ్ర‌గ్ డాన్ గురించి నార్కోటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) సెర్చ్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 10:31 AM GMT
2000 కోట్ల డ్ర‌గ్ డాన్ కం నిర్మాత‌ కోసం NCB సెర్చ్
X

కేవలం మూడేళ్లలో దాదాపు రూ. 2000 కోట్లు సంపాదించిన డ్రగ్స్ రాకెట్‌కు సూత్రధారి అయిన‌ తమిళ సినీ నిర్మాత కం డ్ర‌గ్ డాన్ గురించి నార్కోటిక్స్ బ్యూరో (ఎన్సీబీ) సెర్చ్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అత‌డికి సినిమా వ్యాపారంలో ఆదాయం సరిపోలేదు. అందుక‌ని చీక‌టి వ్యాపారంలో దిగి ఆర్జిస్తున్నాడ‌ని తెలిసింది. న్యూజిలాండ్‌లోని కస్టమ్స్ అధికారులు ఆస్ట్రేలియాలోని పోలీసుల నుండి సమాచారం అందిందని భార‌త‌దేశ‌పు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు.

ఇంత‌కీ నిర్మాత డ్ర‌గ్ దందా ఎలా సాగుతోంది? అత‌డి నిర్వాకం ఏమిటి? అన్న‌ది ఆరా తీస్తే.... ప్ర‌మాద‌క‌ర

మెథాంఫెటమైన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే కీలకమైన సూడోఎఫెడ్రిన్ అనే రసాయనాన్ని ఎండిన కొబ్బరి పొడి లేదా హెల్త్ మిక్స్‌లలో దాచి విదేశాలకు పంపుతున్నట్లు సమాచారం. మెథంఫేటమిన్, మెత్ లేదా క్రిస్టల్ మెత్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉన్న డ్రగ్.. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్‌లలో ఒక‌ కిలో దాదాపు రూ.1.5 కోట్లకు అమ్ముడవుతోంది.

యు.ఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఇన్‌పుట్‌ల ప్ర‌కారం.. ఢిల్లీ నుండి సరుకులు పంపుతున్నార‌ని స‌మాచారం అందిన‌ తర్వాత, ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సంయుక్త బృందం ఏర్పాటు అయింది. నాలుగు నెలల ఇంటెన్సివ్ టెక్నికల్ అండ్ ఫీల్డ్ నిఘా తర్వాత దీనికి సంబంధించిన ముఠా స‌భ్యులు ఢిల్లీలో ఉన్నారని, ఆస్ట్రేలియాకు మరొకసారి సరుకును పంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది! అని NCB డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ చెప్పారు.

పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపూర్‌లోని ఒక గోడౌన్‌కు నిఘా ఉంచ‌గా.. అక్కడ ముఠా సభ్యులు మల్టీగ్రెయిన్ ఫుడ్ మిక్స్‌లో సూడోఎఫెడ్రిన్‌ను దాచిపెట్టి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసి 50 కిలోల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడుకు చెందిన వ్యక్తులను నిరంతరం విచారించగా... ఈ ముఠా గత మూడేళ్లలో 45 సరుకులను పంపిందని, ఇందులో 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ కూడా జ‌త చేసి (వేరొక దానికి) ఉంద‌ని దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 2,000 కోట్లకు పైగా ఉందని ఒక అధికారి తెలిపారు. ఈ దందాకు సూత్రధారి తమిళ సినీ నిర్మాత అని గుర్తించారు. అతడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అతడిని అరెస్టు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. తద్వారా మేము సూడోపెడ్రిన్ మూలాన్ని కనుగొనగలం.. అని ఒక అధికారి తెలిపారు. NCB అధికారులు న్యూజిలాండ్, ఆస్ట్రేలియన్ అధికారులతో మంత‌నాలు సాగించారు. ఆ దేశాల్లో సరుకులు అందుకున్న వ్యక్తులను అరెస్టు చేయడానికి వారంతా చేరుకున్నారు.