Begin typing your search above and press return to search.

ప్రతినిధి 2: అసలు పని స్టార్ట్ చేసిన నారా రోహిత్

అయితే నిజానికి గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఏ హీరోలు అయినా.. మంచి కమర్షియల్ ఓరియెంటెడ్, మాస్ సినిమాలే చేసేందుకు ప్రయత్నిస్తుంటారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:04 AM GMT
ప్రతినిధి 2: అసలు పని స్టార్ట్ చేసిన నారా రోహిత్
X

నారా రోహిత్ ఈ పేరు అటు సినీ ప్రియులకు ఇటు నందమూరి అభిమానులకు బాగా పరిచయమం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరో ఆయన. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన.. త్వరలోనే ప్రతినిధి 2 సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

త‌న కెరీర్‌లోనే సూపర్ హిట్ అందుకున్న ప్ర‌తినిధి చిత్రానికి సీక్వెల్‌గా ఈ ప్ర‌తినిధి 2 తెరకెక్కబోతోంది. ఫ‌స్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ కూడా సినిమాపై ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని మూవీటీమ్ తో పాటు నారా రోహిత్ తెలిపారు. 16,32,96,000 సెక‌న్ల తర్వాత కెమెరా ముందుకు వ‌చ్చిన‌ట్లు చెబుతూ ఓ ఫోటోను అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. అందులో నారా రోహిత్ పై సీన్ షూట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది.

అయితే నిజానికి గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఏ హీరోలు అయినా.. మంచి కమర్షియల్ ఓరియెంటెడ్, మాస్ సినిమాలే చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ నారా రోహిత్ అలా కాదు. ప్రతి మూవీ డిఫెరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటారు. కమర్షియల్ సినిమాలు చేసే సామర్థ్యం ఉన్నా కంటెంట్ సినిమాలకే ఆయన మొగ్గు చూపేవారు. ఆయన సినిమాలో కథలే మాట్లాడుతుంటాయి.

కెరీర్ ఆరంభంలోనే 'బాణం', 'సోలో' వంటి చిత్రాలతో సూపర్ హిట్​ అందుకున్న ఆయన.. తన నటనతో విమర్శకుల మెప్పు కూడా పొందారు. ఆ తర్వాత కూడా 'ప్ర‌తినిధి', 'రౌడీ ఫెలో', 'అసుర' వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్ష‌కుల మ‌దిలో చెదర‌ని ముద్ర వేశారు. 2016, 2017లో అయితే ఏకంగా 'తుంటరి', 'సావిత్రి', 'రాజా చెయ్యి వేస్తే', 'జ్యో అచ్యుతానంద', 'శంకర', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'శమంతకమణి', 'కథలో రాజకుమారి', 'బాలకృష్ణుడు'.. ఇలా తొమ్మిది చిత్రాలు చేసి రికార్డ్ సృష్టించార. ఇవే కాకుండా అదే ఏడాదిలో అతిథి పాత్రలతో కూడా పలు చిత్రాల్లో మెరిశారు. చివరిగా 2018లో ఆయన 'వీరభోగ వసంతరాయలు', 'ఆటగాళ్లు" చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలన్నీ గమనిస్తే అన్నీ డిఫెరంట్ కాన్సెప్ట్ తో ఉంటాయి. మంచి కంటెంట్ ఉంటాయి. అందుకే రోహిత్ కంటూ ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఎలాగో ఇప్పుడు చిత్రసీమలో కంటెంట్ బేస్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నాయి. అందుకే ఆయన మళ్లీ లైన్ లోకి వచ్చారు. అందుకే ఈ ఐదేళ్ల పాటు ఆయన.. కమర్షియల్ సినిమాలకు సంబంధించిన మంచి మంచి ఆఫర్స్ వచ్చినా, దర్శకనిర్మాతల అడిగినా సున్నితంగా నో చెబుతూ వచ్చారు. ఇప్పుడు ప్రతినిధి 2 అంటూ మంచి కంటెంట్ ఉన్న చిత్రంతో రాబోతున్నారు.

ఇకపోతే ప్రతినిధి మొదటి భాగాన్ని ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్ర‌తినిధి 2కు మాత్రం మూర్తి దేవగుప్తాపు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కుమార్రాజా బాతులా, ఆంజనేయులు శ్రీతోట, కొండకల్లా రాజేందర్ రెడ్డి కలిసి వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. 2024 జ‌న‌వ‌రి 25న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.