Begin typing your search above and press return to search.

నరకాసుర ట్రైలర్​.. దేవుళ్లు రాక్షసులుగా మారితే..

మరి ఇంతకీ ఆ సమస్య ఏంటీ? ఎందుకు ఆ గ్రామస్తులపై దాడి జరుగుతుందనేదే తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ప్రచార చిత్రంలో ఎమోషన్, లవ్, యాక్షన్ అంశాలను బాగా చూపించారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 9:22 AM GMT
నరకాసుర ట్రైలర్​.. దేవుళ్లు రాక్షసులుగా మారితే..
X

"నువ్వు నిర్మించకున్న ఈ ప్రపంచంలో అంతా నీవాళ్లే. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు అనాధవే. కొన్నిసార్లు దేవుళ్ళు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది" అనే డైలాగ్స్​తో తాజాగా 'నరకాసుర' అనే పవర్​ ఫుల్​ ట్రైలర్​ రిలీజైంది. మీ ఆలోచనలే మీ శత్రువులు ట్యాగ్ లైన్. లండన్ బాబు, పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్​గా నటించిన ఈ సినిమా నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్​ ట్రైలర్​ను రిలీజ్​ చేశారు.

ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఓ అడవికి సమీపంలో ఉండే గ్రామం నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తున్నట్లు చూపించారు. ప్రచార చిత్రంలో రక్షిత్‌ అట్లూరి ఓ వైపు లారీ డ్రైవర్‌గా మరోవైపు శత్రువులను చీల్చి చెండాడే వ్యక్తిగా డబుల్​ షేడ్స్‌లో కనిపించారు. యాక్షన్ పరంగా తన నటనతో అదరగొట్టేశారు.

ఓ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు అనుకోని ఆపద రాగా... దాంతో పోరాడాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఆ సమస్య ఏంటీ? ఎందుకు ఆ గ్రామస్తులపై దాడి జరుగుతుందనేదే తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ప్రచార చిత్రంలో ఎమోషన్, లవ్, యాక్షన్ అంశాలను బాగా చూపించారు.

సస్పెన్స్ ఎలిమెంట్స్​తో పాటు యాక్షన్ సీన్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అలాగే బ్యాక్​గ్రౌండ్ స్కోర్​ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్​పై డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు.

ఇంకా ఈ చిత్రంలో మలయాళ నటి సంగీర్ధన విపిన్, సీనియర్ నటుడు నాజర్, శత్రు, శ్రీమాన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రా అండ్ రస్టిక్​గా సినిమా ఉండనుంది.