Begin typing your search above and press return to search.

నారా రోహిత్-నారా లోకేష్ ఎలా అయ్యారంటే?

సినిమా న‌టుడు నారా రోహిత్- నారా లోకేష్ అన్న‌ద‌మ్ములు అన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Jun 2025 2:00 AM IST
నారా రోహిత్-నారా లోకేష్ ఎలా అయ్యారంటే?
X

సినిమా న‌టుడు నారా రోహిత్- నారా లోకేష్ అన్న‌ద‌మ్ములు అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు చిన‌బాబు-పెద‌బాబు బిడ్డ‌లు. లోకేష్ తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడు వార‌సత్వం పుణికి పుచ్చుకుని రాజ‌కీయాల్లో రాణిస్తున్నాడు. నారా రోహిత్ మాత్రం త‌న తండ్రి క‌ల కోసం న‌టుడిగా మారి ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే నారా రోహిత్ ని పెద‌నాన్న‌-పెద్ద‌మ్మ అంటే చంద్ర‌బాబు నాయుడు-భువ‌నేశ్వ‌రి త‌న సొంత కొడుకులాగే చూస్తార‌ని తెలుస్తోంది.

పేగు తెంచుకుని పుట్ట‌క‌పోయినా? రోహిత్ ని సొంత బిడ్డ‌లాగే చూస్తారు. చిన్న‌ప్ప‌టి నుంచి పెద్ద‌మ్మ భువ‌నేశ్వ‌రికీ రోహిత్ అంటే చాలా గారాబం అట‌. లొకేష్ పేరుకంటే ముందుగా లోహిత్ అనే పేరు పెట్టాల‌నుకున్నారట చిన‌బాబుకి. కానీ ఎన్టీఆర్ మాత్రం లోకేష్ గా నామ‌క‌ర‌ణం చేయ‌డంతో లోహిత్ పేరు పెట్ట‌లేక‌పోయారట‌. దీంతో లోహిత్ కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని త‌న‌కి రోహిత్ గా పెద్దమ్మ పేరు పెట్టిన‌ట్లు తెలిపాడు.

రోహిత్ జీవితంలో త‌న సొంత త‌ల్లి ఎంత కీల‌క పాత్ర పోషిస్తుందో? పెద్ద‌మ్మ భువ‌నేశ్వ‌రికి కూడా అంతే కీల‌క పాత్ర‌గా ఉంటారట‌. అమ్మ‌తో పాటు పెద్ద‌మ్మ కూడా నిరంత‌రం త‌న‌కు తోడుగా ఉంటార‌ని రోహిత్ తెలిపాడు. అలా క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం అన్న చందంగా నారా రోహిత్-లోకేష్ కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. నారా రోహిత్ చంద్ర‌బాబు నాయుడు త‌మ్మ‌డు రామ్మూర్తి నాయుడు కుమారుడు అన్న సంగ‌తి తెలిసిందే.

ఓ సినిమాలో రోహిత్ మా పెద‌నాన్న కూడా సీఎం అనే డైలాగ్ కూడా ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయిన స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ఉండేవారు. సినిమాలో ఆ డైలాగ్ క‌థానుగుణంగా కుదిరింది. రోహిత్ న‌టించిన 'బైర‌వం' ఇటీవ‌ల రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.