చిన్న బ్రేక్ అనుకున్నా పెద్ద బ్రేక్ పడింది!
నారా వారి వారసుడు రోహిత్ ఆరేళ్ల క్రితం వరకూ బాగానే సినిమాలు చేసాడు. గ్యాప్ లేకుండా ప్రేక్షుకల మధ్యలో ఏదో సినిమాతో ఉండేవాడు.
By: Tupaki Desk | 28 May 2025 12:38 PM ISTనారా వారి వారసుడు రోహిత్ ఆరేళ్ల క్రితం వరకూ బాగానే సినిమాలు చేసాడు. గ్యాప్ లేకుండా ప్రేక్షుకల మధ్యలో ఏదో సినిమాతో ఉండేవాడు. కానీ ఐదేళ్లగా రోహిత్ వెండి తెరపై కనిపించలేదు. మరి కావాలని సినిమాలు చేయలేదా? సరైన అవకాశాలు రాలేదని చేయలేదా? అన్నది తెలియదు గానీ గ్యాప్ అయితే భారీగానే కనిపిస్తుంది. ఈ క్రమంలో రోహిత్ మరేదైనా రంగంలో స్థిరపడ్డాడా? అన్న సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి.
గత ఏడాది `ప్రతినిధి 2` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. తాజాగా మళ్లీ ` భైరవం` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా మరో ఇద్దరు హీరోలుగా నటించారు. వాళ్లతో పాటే రోహిత్ కూడా ఓ హీరోగా కనిపిస్తాడు. తాజాగా ఇంత విరామం ఎందుకు వచ్చింది? అన్న అంశంపై మాట్లాడాడు.
సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రత్యేకమైన కారణలంటూ ఏవీ లేవన్నాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకోవా లనుకున్నా? కానీ అది అనుకోకుండా పెద్ద బ్రేక్ లా మారిందన్నాడు. ఇకపై మాత్రం అలాంటి గ్యాప్ లేకుండా చూసుకుంటానన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రోహిత్ కిది సెకెండ్ ఇన్నింగ్స్ లాంటింది. ఇప్పటి కే ఇండస్ట్రీలో కాంపిటీషన్ పీక్స్ లో ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో రాణి స్తున్నారు. కానీ అన్ని రకాల బ్యాకప్ ఉన్నా? రోహిత్ ఇంకా నటుడిగా బిజీ కాలేదు.
అలాగని ట్యాలెంట్ లేక కాదు. నటుడిగా మంచి గుర్తింపు ఉంది. తొలి సినిమా `బాణం` సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ వెంటనే సోలో తో మంచి సక్సెస్ అందుకున్నాడు. `ప్రతినిధి`, `రౌడీ ఫెలో`, `అప్పట్లో ఒకడుండేవాడు` లాంటి వైవిథ్యమైన చిత్రాలు చేసాడు. కథల ఎంపిక పరంగా రోహిత్ యూనిక్ శైలి ఉంది. అన్ని ఉన్నా? కెరీర్ పై మాత్రం ఫోకస్ చేయలేదు.
