Begin typing your search above and press return to search.

నారా రోహిత్.. సిరి ఎంత హ్యాపీగా ఉందో!

నవ్వుతూ.. ఎంతో లవ్లీగా.. తనకు కాబోయే భర్త వైపు సిరి చూస్తున్న విజువల్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   31 May 2025 3:00 AM IST
నారా రోహిత్.. సిరి ఎంత హ్యాపీగా ఉందో!
X

టాలీవుడ్ నారా రోహిత్.. రీసెంట్ గా భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసి నటించిన ఆ సినిమా.. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం మూవీ ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది.

అదే సమయంలో నారా రోహిత్ యాక్షన్ కు ఓ రేంజ్ లో ప్రశంసలు లభిస్తున్నాయి. సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారని అంతా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చాలా బాగా నటించారని చెబుతున్నారు. డైరెక్టర్ సరైన విధంగా నారా రోహిత్ క్యారెక్టర్ ను డిజైన్ చేయగా.. అందుకు తగ్గట్లే ఆయన కూడా అలరించారు.

అయితే నారా రోహిత్.. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో భైరవం మూవీని తనకు కాబోయే భార్య శిరీష (సిరి)తో చూశారు. సినిమా అయ్యాక.. అనేక మంది వచ్చి నారా రోహిత్ ను ప్రశంసించారు. యాక్షన్ అదిరిపోయిందని కొనియాడారు. ఆ సమయంలో రోహిత్ పక్కన సిరి.. ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు కనిపించారు.

నవ్వుతూ.. ఎంతో లవ్లీగా.. తనకు కాబోయే భర్త వైపు సిరి చూస్తున్న విజువల్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి. సో క్యూట్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సిరి ఎంతో హ్యాపీగా ఉన్నారని చెబుతున్నారు. అలా ప్రేమగా చూసే పార్టనర్ దొరకాలని సందడి చేస్తున్నారు.

కాగా, ఏపీకి చెందిన సిరి.. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ పూర్తి చేసి కొంతకాలం పాటు జాబ్ కూడా చేశారు. ఆ తర్వాత యాక్టింగ్ పై మక్కువతో ఇండియా వచ్చేశారు. హైదరాబాద్ లో ఉంటూ మోడలింగ్ స్టార్ట్ చేశారు. సినిమా ఆడియన్స్ కు హాజరై.. ప్రతినిధి-2 మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఆ సినిమాలో రోహిత్ నే హీరో అన్న విషయం తెలిసిందే.

ప్రతినిధి-2 మూవీ షూటింగ్ సమయంలో రోహిత్, సిరి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబాల వారి ప్రేమకు అంగీకారం తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు రోహిత్, సిరి. ఇప్పుడు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.