నాన్న కోసం నారా వారబ్బాయ్ హీరోగా!
అవును హీరో అవ్వడం అన్నది రోహిత్ కల కాదు. వాళ్ల నాన్ని రామ్మూర్తి నాయుడుది అని రోహిత్ తెలిపాడు.
By: Tupaki Desk | 5 Jun 2025 5:00 PM ISTతల్లిదండ్రుల కల నెరవేర్చే కొడుకులు ఈ కాలంలా చాలా తక్కువ మంది. తనకంటూ ఓ కల ఉందని అటు వైపుగా ప్రయాణం చేసి సక్సెస్ అవుతున్నారు. కన్న వాళ్ల కలలు మాత్రం గాలి కొదిలేస్తున్నారు. కానీ నారా వారి అబ్బాయ్ రోహిత్ మాత్రం ఆ టైపు కాదు. తండ్రి కలను నెరవేర్చిన నటుడిగా భావించాలి. అవును హీరో అవ్వడం అన్నది రోహిత్ కల కాదు. వాళ్ల నాన్ని రామ్మూర్తి నాయుడుది అని రోహిత్ తెలిపాడు.
రామ్మూర్తి నాయుడు చదువుకునే టప్పుడు కాలేజీల్లో నాటకాలు వేసేవారుట. కానీ ఆయన నటన స్టేజ్ వరకే పరిమితమైంది. సినిమాల్లోకి రాలేకపోయారు. ఈనేపథ్యంలో తన తండ్రి కలను కొడుకు రూపంలో చూసుకో వాలనుకున్నారు. అందుకే ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే రోహిత్ ని నటుడు అవ్వమని అడిగారుట. అలా అడిగిన వెంటనే రోహిత్ కుదరదు అన్నాడుట. కానీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నటుడు అవుతానని ఒకే చెప్పాడుట.
ఆ తర్వాత పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు భుజం తట్టడంతో అమెరికాలో యాక్టింగ్ శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు. నటుడిగా తాను సక్సెస్ అయిన నిజమైన ఫైటర్ మాత్రం తన తండ్రి అని అన్నాడు. తనలో పోరాట పటిమ నుంచి తాను కూడా అలా మారానని తెలిపాడు. ఇలా నాన్న కోసం నటుడైన వాళ్లు ఎంత మంది ఉన్నారో. సాధారణంగా సినిమాల్లో నటుడు అవ్వాలని కొడుకులకు ఉన్నా? ఇంట్లో తల్లిదండ్రులకు నచ్చదు.
కుటుంబం నుంచి పెద్దగా సహకారం ఉండదు. ఇల్లు వదిలేసి వచ్చి సక్సెస్ అయిన తర్వాత వెళ్లిన కుమారులు ఎంతో మంది. ఇండస్ట్రీలో ఇలాంటి కథలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సినిమా రంగం అన్నది గ్యారెంటీ లేని జీవితం. బాగా చదువుకుని సినిమాల్లోకి వెళ్తామంటే అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారని వాదిస్తుంటారు. అలాగని తల్లిదండ్రుల వాదన అర్దం లేనిది కాదు. ఎంతో కష్టపడినా ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఫెయిలైన వాళ్లు చాలా మంది ఉన్నారు. జీవితం అలా అవుతుందనే సినిమాలంటే? తల్లిదండ్రులు అంగీకరించరు.
