Begin typing your search above and press return to search.

నారా లోకేష్ 'రజినీ' పోస్ట్.. తారక్ ఫ్యాన్స్ ఫైర్.. ఏం జరిగింది?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   10 Aug 2025 4:00 PM IST
నారా లోకేష్ రజినీ పోస్ట్.. తారక్ ఫ్యాన్స్ ఫైర్.. ఏం జరిగింది?
X

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్, సాబిన్ వంటి స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. దీంతో అంతా మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు కూలీ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు. రజినీకాంత్ కు సంబంధించిన స్పెషల్ వీడియో షేర్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు. కూలీ మూవీ టీమ్ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రజినీకాంత్ ఎరాలో జీవించడం మన అందరి అదృష్టమని తెలిపారు.

రజినీకాంత్ సినిమాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విషయాన్ని తన పోస్ట్ ద్వారా గుర్తుచేశారు. తమ ఫ్యామిలీ డార్క్ హర్స్ లో మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రస్తుతం నారా లోకేష్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో హాట్ టాపిక్ గా నిలిచింది.

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఒక వర్గం ఇప్పుడు లోకేష్ పై మండిపడుతున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదని అంటున్నారు. ఒకేరోజు విడుదలయ్యే ఓ సినిమాకు మద్దతు ఇచ్చి.. మరో మూవీకి మద్దతు పలకపోవడమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా తెలుగు సినిమా అని, బావమరిది మూవీ అని చెబుతున్నారు.

కాగా, ఎన్టీఆర్ లీడ్ రోల్ లో నటించిన వార్-2 మూవీ కూడా కూలీ సినిమా విడుదల రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు సినిమాలు ఆగస్టు 14వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. తారక్.. వార్-2 మూవీతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్ లో సందడి చేయనున్నారు.

స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మూవీలో తారక్.. హృతిక్ ను ఢీకొట్టే పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో తారక్ రోల్ పై మంచి బజ్ ఏర్పడింది. మరి ఇప్పుడు వస్తున్న కామెంట్స్ పై నారా లోకేష్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.