Begin typing your search above and press return to search.

ఆ కథకి ఇంకా నాని కనెక్ట్ కాలేదా?

అంత బాగానే ఉన్నా ఈ మూవీ స్క్రిప్ట్ లో సెకండ్ హాఫ్ నాని కి అంతగా నచ్చలేదంట.

By:  Tupaki Desk   |   26 July 2023 3:00 AM GMT
ఆ కథకి ఇంకా నాని కనెక్ట్ కాలేదా?
X

నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతా లో వేసుకున్నాడు. ఈ చిత్రంతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో హాయ్ నాన్న అనే సినిమా ని కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా కి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం లో ఓ చిన్నారికి తండ్రిగా నాని కనిపించబోతున్నాడు.

అతనికి జోడి గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వివేక్ ఆత్రేయతో నాని అంటే సుందరానికి సినిమా చేశారు. ఈ మూవీ ఆశించిన స్థాయి లో సక్సెస్ అందుకోలేదు. అంతకంటే ముందు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరుగా సినిమాల తో వివేక్ ఆత్రేయ సక్సెస్ అందుకున్నారు.

ఈసారి వివేక్ ఆత్రేయ నాని కి ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథని నేరేట్ చేసినట్లు తెలుస్తోంది. స్టొరీ నచ్చడంతో నాని ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అంత బాగానే ఉన్నా ఈ మూవీ స్క్రిప్ట్ లో సెకండ్ హాఫ్ నాని కి అంతగా నచ్చలేదంట. గతం లో చేసిన వి మూవీ సెకండ్ హాఫ్ పెద్దగా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడంతో ఫ్లాప్ అయింది.

మళ్ళీ అలాంటి సిచువేషన్ రాకుండా ఉండడం కోసం ముందుగానే నాని జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సెకండ్ హాఫ్ కరెక్షన్స్ ని నాని వివేక్ ఆత్రేయకి చెప్పారంట. అవి ఫినిష్ అయ్యి సంతృప్తి చెందితే అప్పుడు స్టార్ట్ చేద్దామని సూచించారట. ఇప్పటికే వివేక్ తో అంటే సుందరానికి ఫ్లాప్ కావడంతో ఈ మూవీ మాత్రం కచ్చితంగా హిట్ కావాల ని భావిస్తున్నారు.

వివేక్ ఆత్రేయ కూడా కంప్లీట్ గా జోనర్ మార్చి నానితో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు అతను చేసిన మూడు సినిమాలు సాఫ్ట్ స్టోరీస్, కామెడీ తో నడిచేవే. ఆ జోనర్ లో ఉండిపోతే ఎస్టాబ్లిష్ కావడం లేదని ఇప్పుడు యాక్షన్ కథాంశంతో నాని తో సినిమా చేసి సక్సెస్ అందుకోవాల ని అనుకుంటున్నాడు.