Begin typing your search above and press return to search.

నాని సినిమాలో మరో హీరో..?

నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నానితో పాటుగా మరో హీరో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తాడని టాక్.

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:30 PM GMT
నాని సినిమాలో మరో హీరో..?
X

న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా లాక్ చేసుకున్నాడని తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. హాయ్ నాన్న రిలీజ్ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా నాని వివేక్ ఆత్రేయ సినిమా మొదలు పెడతాడని తెలుస్తుంది. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నానితో పాటుగా మరో హీరో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తాడని టాక్. ఇప్పటికే ఆ హీరో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ తో పాటుగా సినిమా నుంచి ఈ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. నాని దసరా సినిమాలో కూడా సూర్య పాత్రలో దీక్షిత్ నటించాడు.

ఇక ఇప్పుడు వివేక్ ఆత్రేయ సినిమాలో కూడా మరో ఇంపార్టెంట్ రోల్ ఒక నోటబుల్ హీరో నటిస్తాడని తెలుస్తుంది. వివేక్ ఆత్రేయతో నాని ఆల్రెడీ అంటే సుందరానికీ సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే నాని తో ఈసారి వివేక్ కమర్షియల్ హిట్ కూడా అందుకునేలా ఒక మంచి కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది.

మెంటల్ మదిలో నుంచి అంటే సుందరానికీ వరకు దర్శకుడిగా తన ప్రతిభ చాటుతూ వస్తున్న వివేక్ ఆత్రేయ నానితో మరోసారి తన మార్క్ సినిమా చేస్తాడని అంటున్నారు. ఆ.ఆర్.ఆర్, ఓజీ సినిమాల తర్వాత డివివి బ్యానర్ నుంచి ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా నాని కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. నాని హాయ్ నాన్న ఒక ఎమోషనల్ రైడ్ గా వస్తుండగా వివేక్ ఆత్రేయ సినిమా అటు క్లాస్ ఇటు మాస్ అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించేలా వస్తుందని తెలుస్తుంది.

హాయ్ నాన్న సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శృతి హాసన్ కూడా మరో హీరోయిన్ గా కనిపిస్తుందట. దసరా లాంటి మాస్ హిట్ అందుకున్న తర్వాత నాని హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ సినిమాతో తన మార్క్ చూపించనున్నాడు నాని. ఈ సినిమా తర్వాత నాని మళ్లీ వివేక్ తో మంచి కమర్షియల్ సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.