Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న.. మరో స్టార్ తో నాని ముచ్చట

నేచురల్ స్టార్ నాని సినిమాను ప్రమోట్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అనే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   2 Dec 2023 4:43 PM GMT
హాయ్ నాన్న.. మరో స్టార్ తో నాని ముచ్చట
X

నేచురల్ స్టార్ నాని సినిమాను ప్రమోట్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అనే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా ఇండస్ట్రీలో ఎదిగిన నాని స్టార్ హీరోగా మంచి గుర్తింపునందుకున్నాడు. ఇక నాని అంటే దాదాపు ఇండస్ట్రీలో అందరికి కూడా చాలా ఇష్టమే అని చెప్పాలి. అతను ఎప్పుడు పిలిచినా కూడా మిగతా స్టార్స్ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారు.

ఇక నాని సైతం బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ ఇతర సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు అలా బాక్సాఫీస్ ఫైట్ వచ్చినప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వారితో కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో కూడా నాని స్పెషల్ ఇంటర్వ్యూ చేసే హాట్ టాపిక్ గా నిలిచాడు.

గతంలో కూడా రావణాసుర సినిమాను విడుదల చేస్తున్న సమయంలో తన దసరా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా రవితేజతో ఇంటర్వ్యూ కూడా చేశాడు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక హాయ్ నాన్న సినిమా విషయంలో సందీప్ రెడ్డి తో ఇంటర్వ్యూ చేసిన నేచురల్ స్టార్ మరొక స్టార్ ను కూడా రంగంలోకి దింపడం విశేషం. ఆయన మరెవరో కాదు విక్టరీ వెంకటేష్.

వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ముందుగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన వెంకటేష్ చాలా ఉత్సాహంగా యువతను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కోసం నానితో చేతులు కలిపాడు. వీళ్లిద్దరూ ఇంటర్వ్యూ త్వరలోనే యూట్యూబ్ లో రిలీజ్ కాబోతోంది.

అందుకు సంబంధించిన ఒక స్పెషల్ స్టిల్ కూడా రిలీజ్ చేయగా అది వైరల్ అవుతోంది. ఇక సైంధవ హాయ్ నాన్న రెండు సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి అంటే రెండు సినిమాల్లో కూడా తండ్రి కూతుళ్ళ ఎమోషన్ ఉండబోతోంది. టీజర్ ట్రైలర్ ద్వారానే ఆ పాయింట్ చాలా బాగా హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ వారి సినిమాల కలిసి ప్రమోట్ చేసుకునే విధంగా ఇంటర్వ్యూ చేస్తూ ఉండడం విశేషం.