Begin typing your search above and press return to search.

పొరుగు భాష‌లో చిత‌క్కొట్టిన నాని-వంగా

చెన్న‌య్‌లో జ‌రిగిన అవార్డుల కార్య‌క్ర‌మంలో తెలుగు సినిమా కేట‌గిరీలో 3 విభిన్న విభాగాలలో 3 అవార్డులను నాని సినిమా గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:25 AM GMT
పొరుగు భాష‌లో చిత‌క్కొట్టిన నాని-వంగా
X

నేచురల్ స్టార్ నాని న‌టించిన‌ 'హాయ్ నాన్న' ఇటీవ‌లే విడుదలై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి బిహైండ్ వుడ్స్ పుర‌స్కారాలు ద‌క్కాయి. చెన్న‌య్‌లో జ‌రిగిన అవార్డుల కార్య‌క్ర‌మంలో తెలుగు సినిమా కేట‌గిరీలో 3 విభిన్న విభాగాలలో 3 అవార్డులను నాని సినిమా గెలుచుకుంది.

సినిమాలో అద్భుత న‌ట‌ప్రదర్శనకు గాను నాని ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా, మృణాల్ ఠాకూర్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన శౌర్యువ్‌కి కూడా అవార్డు వచ్చింది. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ యానిమల్‌ను అందించిన సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు.

నాని తాజా విజ‌యంతో రెట్టించిన ఉత్సాహంలో త‌దుప‌రి ప్రాజెక్టుల్లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంత‌లోనే సందీప్ రెడ్డి వంగా త‌దుప‌రి ప్ర‌భాస్ తో స్పిరిట్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇది ఒక ఇంటెన్స్ యాక్ష‌న్ సినిమా అవుతుంద‌ని స‌మాచారం.

నాని అలాంటి నిర్ణ‌యం?

నాని త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కొత్తేమీ కాదు. అత‌డు 'నాన్ ఈ' సినిమాతో కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. 'నాన్ ఈ' విజయం తర్వాత కోలీవుడ్‌లో పాపులర్ అయిన టాలీవుడ్ నటుడు నాని, బాలీవుడ్ హిట్ చిత్రం తమిళ రీమేక్‌లో న‌టిస్తాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇందులో పరిణీతి చోప్రా క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంది. ఒరిజినల్‌లో రణ్‌వీర్ సింగ్ - అనుష్క శ‌ర్మ‌ పోషించిన పాత్రలను వీరిద్దరూ తిరిగి త‌మిళంలో పోషిస్తారని సమాచారం. దర్శకుడు విష్ణువర్ధన్‌ అసోసియేట్‌గా పనిచేసిన గోకుల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చాలా మంది పేర్లను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, మేకర్స్ తమిళ రీమేక్ కోసం నానిని ఎంపిక చేసుకున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. హిందీ రీమేక్ కోసం మేకర్స్‌తో చర్చలు జరుగుతున్నాయని నాని ప్ర‌తినిధి ఒక‌రు ధృవీక‌రించిన‌ట్టు కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే ఇంకా ఏదీ అధికారికంగా కాదు. అయితే నాని తన కెరీర్ కీల‌క ద‌శ‌లో ఉన్నందున మల్టీ-ఫిల్మ్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ చిత్రానికి సంతకం చేయడంపై నాని రెండు ఆలోచనల్లో ఉన్నట్లు మరొక సోర్స్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం నాని చేతిలో మూడు తెలుగు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. నాని న‌టించిన‌ స‌రిపోదా శ‌నివారం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.