Begin typing your search above and press return to search.

సంక్రాంతికి నాని.. తట్టుకోగలడా..?

సుజిత్ నానితో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   15 April 2024 4:30 PM GMT
సంక్రాంతికి నాని.. తట్టుకోగలడా..?
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సక్సెస్ ఫాంలో ఉన్నాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమై 15 ఏళ్ల కెరీర్ లో 30 సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు నాని. మధ్యలో కెరీర్ కాస్త గాడి తప్పినా మళ్లీ సెట్ రైట్ చేసుకుని నిలబడ్డాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనిపించేలా చేసుకున్నాడు. హిట్లు ఫ్లాపులు సహజమే కానీ దాన్ని కవర్ చేస్తూ కెరీర్ కొనసాగించడమే పెద్ద రిస్క్.

దసరా ముందు వరకు నాని కేవలం ఒకే తరహా కథలు మాత్రమే చేస్తాడని అనుకున్న వారందరికీ థరణి పాత్రతో షాక్ ఇచ్చాడు. నాని లో ఇంత మాస్ హీరో ఉన్నాడా అనిపించేలా దసరా అతన్ని 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా నాని ఖాతాలో డీసెంట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు.

అంటే సుందరానికీ సినిమా తో వివేక్ డైరెక్షన్ లో పనిచేసిన నాని మరోసారి అతనితో పనిచేయడం తో ఈ ప్రాజెక్ట్ పై బజ్ పెరిగింది. ఇక ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నాని సుజిత్ ఈ కాంబో అసలు ఊహించలేదు. సాహో, ఓజీ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సుజిత్ నానితో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

సంక్రాంతి అంటే సినిమాల పండుగ షురూ అయినట్టే.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ ఫైట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, రవితేజ సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకోగా జై హనుమాన్ కూడా సంక్రాంతికి వస్తుందని టాక్. వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా టైటిల్ నే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారు. సో అది కూడా రేసులో ఉంటుంది. పవన్ హరి హర వీరమల్లుని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతల ప్లాన్. మరి ఇన్ని సినిమాల మధ్యలో నాని సినిమా వచ్చి తట్టుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. నాని కి ఎలాగు మార్చి రిలీజ్ కలిసి వచ్చింది కాబట్టి సంక్రాంతి స్కిప్ చేసి మార్చి రిలీజ్ చేస్తే మరో దసరా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.