Begin typing your search above and press return to search.

DVVతో నాని మైండ్ బ్లాక్ అయ్యే డీల్..!

నాని చేస్తున్న ఈ రెండు సినిమాలకు నిర్మాత డివివి దానయ్య అవ్వడం విశేషం. డివివి బ్యానర్ లో సరిపోదా శనివారం ఆ తర్వాత సుజిత్ మూవీ ఈ రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు నాని.

By:  Tupaki Desk   |   29 Feb 2024 5:20 PM GMT
DVVతో నాని మైండ్ బ్లాక్ అయ్యే డీల్..!
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ లో సూపర్ ఫాం లో ఉన్నాడని చెప్పొచ్చు. జెర్సీ హిట్ తర్వాత వి, టక్ జగదీష్ రెండు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యే సరికి వాటి ఫలితాలు పర్ఫెక్ట్ గా తెలియలేదు. ఇక తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా మరోసారి నాని సత్తా చాటింది. డిఫరెంట్ స్టోరీ సెలక్షన్స్ లో నానికి ఉన్న టేస్ట్ ఏంటన్నది ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తోనే వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికీ సినిమా చేశాడు నాని.

ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు కానీ ఒక వర్గం ఆడియన్స్ ని మాత్రం మెప్పించింది. అంటే సుందరానికీ సినిమా ఓటీటీలో మాత్రం మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత దసరాతో నాని చేసిన సంచలనం తెలిసిందే. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని దసరా అదిరిపోయే హిట్ అందుకుంది. ఇక ఆ హిట్ వెంటనే మరోసారి తన మార్క్ ఎమోషనల్ కంటెంట్ తో హాయ్ నాన్న తీయగా అది కూడా సూపర్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న నాని ఈ సినిమా తర్వాత సుజిత్ తో సినిమా లక్ చేసుకున్నాడు. నాని చేస్తున్న ఈ రెండు సినిమాలకు నిర్మాత డివివి దానయ్య అవ్వడం విశేషం. డివివి బ్యానర్ లో సరిపోదా శనివారం ఆ తర్వాత సుజిత్ మూవీ ఈ రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు నాని. అయితే ఈ రెండు సినిమాలకు నాని బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

డివివి దానయ్య నానితో రెండు సినిమాలకు కలిపి భారీ మొత్తంలో కోట్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం నాని 15 కోట్లకు అటు ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటుండగా దానయ్య రెండు సినిమాలకు కలిపి 40 కోట్ల పైన డీల్ సెట్ చేసుకున్నారట. నాని కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ సినిమాలకు అందుకుంటున్నాడు. ఈమధ్య మీడియం రేంజ్ సినిమాలు కూడా వర్క్ అవుట్ అయితే భారీ వసూళ్లను రాబడుతున్నాయి. జస్ట్ హిట్ అనిపించుకుంది అంటే టైర్ 2 హీరో సినిమా కూడా 50 కోట్లు కొట్టేస్తున్నాడు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో కూడా వారు అప్డేట్ అయినట్టు తెలుస్తుంది.