Begin typing your search above and press return to search.

నానికి 'నాన్న' టెన్షన్?

ఇదిలా ఉంటే ఇప్పుడు హాయ్ నాన్న సినిమా రిలీజ్ కోసం కొత్త తలనొప్పి వచ్చి పడింది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:38 PM GMT
నానికి నాన్న టెన్షన్?
X

నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా తర్వాత రాబోతోన్న మూవీ హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శౌర్యువ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హాయ్ నాన్న సినిమా రిలీజ్ కోసం కొత్త తలనొప్పి వచ్చి పడింది.

ఈ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని అనుకున్నారు. డిసెంబర్ నెలలో వస్తుందని ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే అనూహ్యంగా ఆ తేదీన డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది.

రీసెంట్ గా ఈ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. సలార్ కి పోటీగా మూవీ రిలీజ్ చేయడం అంటే కోరి డిజాస్టర్ తెచ్చుకోవడమే అవుతుంది. దీంతో రిలీజ్ డేట్ విషయంలో ఇప్పుడు మేకర్స్ ఆలోచనలో పడ్డారు.

డిసెంబర్ 1న రిలీజ్ చేద్దామని ఆలోచిస్తున్న అదే రోజు రణబీర్ కపూర్ యానిమల్ సినిమా రిలీజ్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో తెలుగులో కూడా యానిమల్ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యి ఉంది. పోనీ సెకండ్ వీక్ కి వెళ్దామంటే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. డిసెంబర్ 8న ఈ రెండు మూవీస్ ప్రేక్షకుల ముందుకి రావడానికి డేట్ కన్ఫర్మ్ చేసుకున్నాయి.

పోనీ డిసెంబర్ 15న అనుకుంటే కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ధనుష్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొద్దిలో కొద్దిగా ఆ డేట్ మాత్రమే కొంత సేఫ్ గా కనిపిస్తున్న వారం రోజుల వ్యవధిలోనే సలార్ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో కచ్చితంగా హాయ్ నాన్న కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది.

మరి మేకర్స్ మూవీ రిలీజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ లేదనే చెప్పాలి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కంప్లీట్ గా జోనర్ మార్చి నాని చేస్తోన్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ అయితే ఉంది.