Begin typing your search above and press return to search.

నాని శ్రీకాంత్ ఓదెల.. ఈసారి మరింత భారీగా..!

అయితే నాని శ్రీకాంత్ ఓదెల మళ్లీ కలిసి పనిచేయనున్నారు. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలోనే ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 4:43 PM GMT
నాని శ్రీకాంత్ ఓదెల.. ఈసారి మరింత భారీగా..!
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తనతో దసరా లాంటి సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెలతో సినిమా ఉంటుందని టాక్. నాని కెరీర్ లో మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తైతే దసరా ఒక ఎత్తు. ఆ సినిమాతోనే నాని ఫస్ట్ టైం 100 కోట్ల మార్క్ కూడా టచ్ చేశాడు. కొత్త వాడైనా సరే శ్రీకాంత్ మీద నాని పెట్టుకున్న నమ్మకం అతని కెరీర్ లో సాలిడ్ హిట్ పడేలా చేసింది. దసరా తర్వాత నాని హాయ్ నాన్న అంటూ తన మార్క్ సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్నారు.

అయితే నాని శ్రీకాంత్ ఓదెల మళ్లీ కలిసి పనిచేయనున్నారు. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలోనే ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ కాంబో మొదటి సినిమానే దసరా లాంటి మాస్ అటెంప్ట్ చేయగా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కాబట్టి ఈసారి దాన్ని మించిన ప్రయత్నం చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలో నాని కోసం శ్రీకాంత్ ఓ పీరియాడికల్ స్టోరీ రాసినట్టు తెలుస్తుంది.

దసరా కూడా 1980 బ్యాక్ డ్రాప్ లోనే తీశారు. కానీ శ్రీకాంత్ ఈసారి మరింత వెనక్కి వెళ్తున్నాడట. బాహుబలి రేంజ్ లో నానితో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేయాలని కూడా ఆలోచన ఉందట. నాని శ్రీకాంత్ ఈ కాంబో అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తప్పకుండా ఈ కలయిక అద్భుతాలు చేస్తుందని ఆడియన్స్ నమ్ముతున్నారు.

మరి ఈ కాంబినేషన్ లో రెండో సినిమాపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కథ నమ్మి నాని రంగంలోకి దిగాడు అంటే అందులో కచ్చితంగా తగిన మ్యాటర్ ఉన్నట్టే లెక్క. అయితే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు నాని బల్క్ డేట్స్ అడిగినట్టు తెలుస్తుంది. అందుకే నాని స్పీడ్ స్పీడ్ గా మరో సినిమా పూర్తి చేసి శ్రీకాంత్ సినిమాకు రెడీ అవుతాడని అంటున్నారు. మరి దసరా కాంబో రెండో ప్రయత్నంగా ఏం చేస్తారు.. ఎలా చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అది క్లారిటీ రావాలంటే సినిమా నుంచి ఎక్స్ క్లూజివ్ అప్డేట్ బయటకు రావాల్సిందే.