Begin typing your search above and press return to search.

దసరా డైరెక్టర్ నానితో లేటెందుకు..?

నాని తోనే దసరా డైరెక్టర్ దాదాపు ఓకే అని తెలుస్తున్నా నాని వరుస సినిమాల వల్ల శ్రీకాంత్ కి టైం ఇవ్వలేకపోతున్నాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:05 AM GMT
దసరా డైరెక్టర్ నానితో లేటెందుకు..?
X

డైరెక్టర్లను ఏరి పట్టుకోవడంలో తన మార్క్ చూపిస్తున్న నాని కొత్త వారికి అవకాశం ఇస్తూ వారితో సక్సెస్ లను అందుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ దసరాతో శ్రీకాంత్ ఓదెలని.. హాయ్ నాన్నతో శౌర్యువ్ అనే దర్శకుడిని పరిచయం చేసిన నాని రెండు సినిమాలను సూపర్ హిట్ చేసుకున్నాడు. చాలామంది హీరోలు కొత్త వారితో రిస్క్ ఎందుకు అనుకుంటారు కానీ నాని మాత్రం ఆ రిస్క్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. నాని తో పరిచయం అవుతున్న డైరెక్టర్స్ అంతా కూడా ప్రతిభ గల వారే అన్న పేరు పడింది.

ఇదిలా ఉంటే నానితో దసరా సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల సినిమా వచ్చి ఏడాది కావొస్తున్నా తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వలేదు. దసరాలో అంతకుముందు ఉన్న నాని ఇమేజ్ కి భిన్నంగా ప్రజెంట్ చేసిన శ్రీకాంత్ ధరణి పాత్రతో నానికి సరికొత్త మాస్ ఇమేజ్ వచ్చేలా చేశాడు. దసరా సినిమా అతను హ్యాండిల్ చేసిన తీరుని చూసి టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడని ఫిక్స్ అయ్యారు.

దసరా తర్వాత శ్రీకాంత్ ఎవరితో చేస్తున్నాడు అన్న దానికి క్లారిటీ రాలేదు. మళ్లీ తన సెకండ్ సినిమా కూడా నానితో చేస్తాడన్న వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగలేదు. దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఇలా తన సెకండ్ సినిమా కోసం ఇంత టైం తీసుకోవడం ఆడియన్స్ ని ఇబ్బంది పెడుతుంది.

నాని శ్రీకాంత్ మళ్లీ దసరా కాంబో రిపీట్ అయితే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. దసరా తర్వాత శ్రీకాంత్ మెగా హీరోతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చినా అది జరగలేదు. నాని తోనే దసరా డైరెక్టర్ దాదాపు ఓకే అని తెలుస్తున్నా నాని వరుస సినిమాల వల్ల శ్రీకాంత్ కి టైం ఇవ్వలేకపోతున్నాడని తెలుస్తుంది. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హిట్ 3 కూడా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక కానీ శ్రీకాంత్ ఓదెలతో సినిమా ఉంటుంది. అప్పటివరకు నాని ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ని రిపీట్ చేయాలని చూస్తున్న నాని, శ్రీకాంత్ ఓదెలతో సినిమా కన్ఫర్మ్ అవుతుండగా హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ కూడా నానితో మరో సినిమా చేస్తాడేమో చూడాలి.