Begin typing your search above and press return to search.

షారుఖ్‌, నానిలకే ఆ క్రెడిట్‌..!

నాని ఈ ఏడాది దసరా మరియు హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

By:  Tupaki Desk   |   28 Dec 2023 4:55 AM GMT
షారుఖ్‌, నానిలకే ఆ క్రెడిట్‌..!
X

మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరం ముగియబోతుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా సినిమా ఇండస్ట్రీలో విజయాల కంటే పరాజయాలు ఎక్కువ నమోదు అయ్యాయి. ఈసారి కూడా విజయాల శాతం చాలా తక్కువగా ఉంది. అయితే కొన్ని సినిమాలు అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటే, కొన్ని మాత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి నిరాశ పరిచాయి.

చాలా మంది టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఈ ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాకుండా మొహం చాటేస్తే కొందరు మాత్రం ఒక్క చిత్రాన్ని విడుదల చేశారు. అయితే అతి కొద్ది మంది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారిలో నేచురల్‌ స్టార్‌ నాని ఉన్నాడు.

నాని ఈ ఏడాది దసరా మరియు హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా సినిమా ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు నమోదు చేయలేదు. కాని సినిమాకు దక్కిన వసూళ్లు నిర్మాతలకు మరియు బయ్యర్లకు సంతృప్తిని మిగిల్చాయి. అంతే కాకుండా దసరా హిట్ చిత్రాల జాబితాలో నిలిచింది.

ఇక ఏడాది చివర్లో వచ్చిన హాయ్ నాన్న సినిమాకు హిట్‌ టాక్ దక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సాలిడ్‌ వసూళ్లను నమోదు చేసింది. నిర్మాతకు మరియు బయ్యర్లకు నాన్న గా నాని భారీ లాభాలను తెచ్చి పెట్టాడు. ఒకే ఏడాది ఇలా రెండు హిట్ సినిమాలను దక్కించుకున్న ఘనత నానికి దక్కింది.

అటు బాలీవుడ్‌ లో షారుఖ్ ఖాన్‌ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి రెండు సినిమాలు పఠాన్ మరియు జవాన్ సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్లతో బ్లాక్‌ బస్టర్ గా నిలిచాయి. ఇక మూడో సినిమా డంకీ మాత్రం జస్ట్‌ పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి.

మొత్తానికి ఒకే ఏడాది భారీ విజయాలను సొంతం చేసుకున్న ఘనత బాలీవుడ్‌ లో షారుఖ్ ఖాన్‌ కి మరియు టాలీవుడ్‌ లో నానికి దక్కింది. వచ్చే ఏడాది కూడా నాని నుంచి రెండు లేదా మూడు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు కూడా కచ్చితంగా మంచి విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.