Begin typing your search above and press return to search.

'శనివారం' డైరీ.. నాని అందరి లెక్కలు తెలుస్తాడా?

టైటిల్ కు తగ్గట్టుగానే ప్రతీ శనివారం ఏదొక అప్డేట్ అందిస్తూ వస్తున్న మేకర్స్.. ఈరోజు ఓ స్పెషల్ పోస్టర్ తో వచ్చారు

By:  Tupaki Desk   |   6 April 2024 4:40 PM GMT
శనివారం డైరీ.. నాని అందరి లెక్కలు తెలుస్తాడా?
X

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''సరిపోదా శనివారం''. 'అంటే సుందరానికీ' తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్‌ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. టైటిల్ కు తగ్గట్టుగానే ప్రతీ శనివారం ఏదొక అప్డేట్ అందిస్తూ వస్తున్న మేకర్స్.. ఈరోజు ఓ స్పెషల్ పోస్టర్ తో వచ్చారు.

'సరిపోదా శనివారం' సినిమాలో సూర్య అనే పాత్రలో నాని కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా సూర్య తన గేమ్‌ను అలా ప్రారంభిస్తాడు అంటూ, చిత్ర బృందం తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను పంచుకున్నారు. శనివారాలను సూర్య స్కోర్లు సెటిల్ చెయ్యడం కోసమే ఉపయోగించుకుంటాడని పేర్కొన్నారు. అంతేకాదు మీ డైరీలలో మీరు ఎలాంటి ఆలోచనలను వ్రాస్తారో చెప్తే.. ఇంట్రెస్టింగ్ గా రెస్పాండ్ అయిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ కూడా అందుతుందని ట్వీట్ చేసారు.

ఈ పోస్టర్ లో నాని చాలా ఇంటెన్స్ గా చూస్తున్నారు. ఇందులో ''రాజు - నా బైక్ ని గుద్ది సారీ చెప్పకుండా వెళ్లాడని.. ముత్యాల రావు - పాన్ పరాగ్ నములుతూ.. నారాయణ ప్రభ..'' అంటూ ఒక పేపర్ మీద పెన్సిల్ తో ఏదో రాసుకోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ డైరీ వెనుక అసలు మ్యాటర్ ఏంటనేది ఖచ్చితంగా తెలియదు కానీ.. పోస్టర్ ను బట్టి సూర్య ఆ వారంలో తనను ఇబ్బంది పెట్టిన వారందరి పేర్లు నోట్ చేసుకొని, శనివారం నాడు వాళ్లందరి లెక్కలు తెలుస్తాడేమో అనిపిస్తోంది.

'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఫస్ట్ లుక్ లో నాని సంకెళ్లు తెంపుకుంటూ కోపోద్రేకాలు చూపించారు. టైటిల్ గ్లింప్స్ లో ఒక చీకటి గదిలో నుంచి గొలుసులు తెంచుకొని, తలుపులు బద్దలు కొట్టుకుంటూ బయటకు రావడం కనిపించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నాని పిడికిలి బిగించి, ఒక రౌడీ మెడ వంచి పట్టుకొని పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక టీజర్ లో కోపాన్ని క్రమబద్దంగా, పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే వ్యక్తిగా నాని పరిచయం చేసారు. ఇదంతా చూస్తుంటే నాని ఈసారి వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు అర్థమవుతోంది.

ఈ పాన్ ఇండియా చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్.జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మురళి.జి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.

నాని కెరీర్ లో 31వ చిత్రం 'సరిపోదా శనివారం'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్‍ రాజుకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్‍ ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.