Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ని వదలని నాని..?

ఈ సినిమాను ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్ ని తీసుకున్నారని టాక్.

By:  Tupaki Desk   |   19 Oct 2023 12:00 PM GMT
ఆ హీరోయిన్ ని వదలని నాని..?
X

న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న డిసెంబర్ 7న రిలీజ్ లాక్ చేశారు. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు డైరెక్షన్ లో హాయ్ నాన్న ఒక మంచి ఎమోషనల్ సినిమాగా వస్తుందని అంటున్నారు. ఈమధ్యనే రిలీజైన టీజర్ కూడా సినిమాపై బజ్ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయతో నాని సినిమా ఉంటుందని తెలిసిందే. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఆ సినిమా కొంతమంది ప్రేక్షకులను మెప్పించినా కమర్షియల్ గా మాత్రం సినిమా సక్సెస్ అందుకోలేదు.


వివేక్ తో అంటే సుందరానికీ సినిమా పనిచేసే టైం లోనే అతనితో మరో సినిమా చేయాలని అనుకున్నాడు నాని. అందుకే హాయ్ నాన్న తర్వాత వివేక్ తో సినిమా లైన్ లో పెట్టారు. ఈ సినిమాను ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్ ని తీసుకున్నారని టాక్. ఆల్రెడీ ప్రియాంక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తుంది.

సుజిత్ డైరెక్షన్ లో పాన్ ఇండియా బొమ్మగా రాబోతున్న ఓజీ సినిమాలో ప్రియాంక నటిస్తుంది. ఆ సినిమానే అమ్మడికి నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తీసుకొచ్చేలా ఉంది. ఆ ప్రాజెక్ట్ తర్వాత నానితో ప్రియాంక జత కడుతుంది. ఆల్రెడీ నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన ప్రియాంకా మరోసారి నానితో రొమాన్స్ కు రెడీ అయ్యింది. వివేక్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో అలా చూస్తే నాని సినిమాలో ప్రియాంక పాత్ర కచ్చితంగా బాగుంటుందని చెప్పొచ్చు.

తమిళ్ లో ఆల్రెడీ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో అదరగొడుతుంది ప్రియాంక తెలుగులో కూడా పవన్ నాఇ సినిమాలతో ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంటుంది. నాని గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంకని కావాలని తీసుకోవడం వెనుక సినిమాలో వివేక్ చెప్పిన పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అనిపించడమే అని తెలుస్తుంది. మరి నాని ప్రియాంక గ్యాంగ్ లీడర్ లెక్క తప్పినా ఈసారి ఇద్దరు కలిసి సూపర్ హిట్ కొడతారేమో చూడాలి. పవన్ ఓజీ, నాని వివేక్ ఆత్రేయ సినిమా రెండు సినిమాలు కూడా 2024 లోనే రిలీజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇయర్ ప్రియాంక రెండు క్రేజీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించనుందని చెప్పొచ్చు.