Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సీతతో నాన్న రొమాంటిక్ ఫోజ్‌

టీజర్ ప్రకటన పోస్టర్ లో నాని మరియు మృణాల్ లు రొమాంటిక్ గా.. చాలా ప్రేమగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:54 PM GMT
పిక్ టాక్ : సీతతో నాన్న రొమాంటిక్ ఫోజ్‌
X

నాని హీరోగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌ గా రూపొందుతున్న హాయ్ నాన్న సినిమాని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కి ముందే హాయ్ నాన్న సినిమా తో నాని ప్రేక్షకులను పలకరించడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.


ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు నాని అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. సినిమా పై అంచనాలు మరింతగా పెంచేందుకు గాను మేకర్స్‌ అక్టోబర్‌ 15న టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

టీజర్ ప్రకటన పోస్టర్ లో నాని మరియు మృణాల్ లు రొమాంటిక్ గా.. చాలా ప్రేమగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నానితో మృణాల్‌ జోడీ ఎలా ఉంటుందో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రొమాంటిక్ ఫోజ్ చూసిన తర్వాత చాలా మంది వావ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా ఇప్పుడు సూపర్ జోడీ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీతతో నాన్న జోడీ అదిరిందని కొందరు అంటున్నారు.

ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య ఉండే అనురాగం ను చూపించడంతో పాటు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని కూడా దర్శకుడు చూపించబోతున్నాడు అని ఈ పిక్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది. నాని ఈ సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు చాలా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు. ఈ పిక్‌ ఆ నమ్మకంను బలపర్చుతుంది.