Begin typing your search above and press return to search.

సౌత్ లో మహేష్ తరువాత నాని బిగ్గెస్ట్ రికార్డ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది

By:  Tupaki Desk   |   11 Dec 2023 6:22 AM GMT
సౌత్ లో మహేష్ తరువాత నాని బిగ్గెస్ట్ రికార్డ్
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. లేటెస్ట్ గా ఈ మూవీ అమెరికాలో మిలియన్ డాలర్లు రాబట్టిన మూవీల జాబితాలో నిలిచింది. యూఎస్ఏలో మిలియన్ డాలర్ మార్క్ చేరుకున్న నాని 9వ సినిమాగా హాయ్‌ నాన్న నిలిచింది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద మన దక్షిణాది హీరోల సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో దక్షిణాది చిత్రసీమకు చెందిన హీరోల గురించి ఫ్యాన్స్ లో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. యూఎస్ లో అత్యధిక సార్లు ఏ హీరో మిలియన్ డాలర్క్ మార్క్ చేరుకున్నారోనని తెగవెతికేస్తున్నారు. తమ అభిమాన హీరోల గురించి సెర్చ్ చేసేస్తున్నారు. ఈ సమయంలో ఆ ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది.

ఇప్పటివరకు యూఎస్ లో అత్యధిక సార్లు మిలియన్ డాలర్ల మార్కు చేరుకున్న రికార్డు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు మీద ఉంది. ఆయన నటించిన 11 సినిమాలు అమెరికాలో మిలియన డాలర్లకు పైగా వసూలు చేశాయి. ఆ తర్వాత స్థానంలో నాని 9 సినిమాలతో నిలిచారు. నాని తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ 8 సినిమాలతో మూడో స్థానంలో ఉన్నారు.

మిగతా హీరోల విషయానికి వస్తే.., పవన్ కళ్యాణ్ - 7, ఎన్టీఆర్ - 7, దళపతి విజయ్-7, ప్రభాస్ - 5, అల్లు అర్జున్ - 5, చిరంజీవి - 4, బాలకృష్ణ - 4, విజయ్ దేవరకొండ - 4, వరుణ్ తేజ్ -3, రామ్ చరణ్-3, దుల్కర్ సల్మాన్-3, విక్రమ్-3, నాగార్జున-2, వెంకటేశ్-2, నవీన్ పొలిశేట్టి-2, కమల్ హాసన్-2, నాగచైతన్య-2, సాయిధరమ్ తేజ్-2, కార్తి-2, జయం రవి-2 సినిమాలు మిలియన్ డాలర్ మార్కు చేరుకున్నాయి.

అజిత్, యశ్, శ్రీవిష్ణు, నిఖిల్, అడవి శేష్, అఖిల్, అనుష్క శెట్టి, కీర్తి సురేశ్, సమంత నటించిన ఒక్కో సినిమా మాత్రమే అమెరికాలో మిలియన్ డాలర్ మార్కు చేరుకుంది. ఇప్పుడు మన తెలుగు సహా దక్షిణాది సినిమాలన్నీ ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నాయి. దీంతో 1000 కోట్ల టార్గెట్ తో మూవీస్ తీస్తున్న మన సౌత్ డైరెక్టర్స్, హీరోస్ స్టామినాను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు సినీ క్రిటిక్స్.