Begin typing your search above and press return to search.

నాని చేయాల్సిన సినిమా అతనితో..!

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా తమ్ముడు. పవర్ స్టార్ టైటిల్ తో ఆయన వీరాభిమాని నితిన్ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   30 March 2024 9:29 AM GMT
నాని చేయాల్సిన సినిమా అతనితో..!
X

ఒక హీరోకి అనుకున్న సినిమా మరొక హీరో చేయడం సర్వసాధారణం. ఎందుకంటే డైరెక్టర్ చెప్పిన పాయింట్ నచ్చినా వారికున్న కమిట్మెంట్స్ వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది. లేదా పాయింట్ బాగున్నా దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో అనే డౌట్ తో వదులుకుంటారు. అయితే అలా వదిలిన సినిమాలు హిట్ అయితే అనవసరంగా ఒక హిట్ సినిమా మిస్ చేసుకున్నామే అన్న భావన కలుగుతుంది. హీరోలు వారి వారి కమిట్మెంట్స్ ని బట్టి సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం అలానే ఒక హీరో కాదన్న సినిమా మరో హీరో చేశాడు. ఈరోజు ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.


నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా తమ్ముడు. పవర్ స్టార్ టైటిల్ తో ఆయన వీరాభిమాని నితిన్ వస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా బ్రదర్ సెంటిమెంట్ తో రాబోతుందని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. ముందు ఈ సినిమాను నానితో చేయాలని ప్రయత్నించారు. అయితే నానికి కథ నచ్చినా ఆల్రెడీ M.C.A సినిమాలో భూమికతో కలిసి నటించాడు. ఆ సినిమాలో భూమిక వదిన అయినా ఆమెకు ఆపద వస్తే తమ్ముడిలా ఆమె ముందు నిలబడ్డాడు.

వేణు శ్రీరాం తమ్ముడు సినిమా కూడా బ్రదర్ సెంటిమెంట్ ఉంటుందని అర్థమవుతుంది. కథ బాగున్నా నాని M.C.A సీన్ రిపీట్ అవుతుందని భావించి తమ్ముడు సినిమాకు నో చెప్పి ఉండొచ్చని చెబుతున్నారు. నాని ఈమధ్య సూపర్ ఫాం లో ఉన్నాడు. మొన్నటిదాకా నాని కేవలం క్లాస్ సినిమాలే చేస్తాడని అనుకున్న ఆడియన్స్ కు దసరా సినిమాతో సర్ ప్రైజ్ చేశాడు. నాని కథ ఓకే చేశాడు అంటే అందులో కచ్చితంగా మ్యాటర్ ఉన్నట్టే లెక్క అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే తమ్ముడు సినిమా మాత్రం కథ బాగున్నా కూడా తను ఇదివరకు ఆల్రెడీ అలాంటి సినిమా చేశాడు కాబట్టే ఆ సినిమా వద్దనుకున్నాడని చెప్పుకుంటున్నారు.

అయితే లేటెస్ట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే మాత్రం తమ్ముడు గా నితిన్ ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడు. నాని కాదన్న కారణం ఏమో కానీ తమ్ముడుతో నితిన్ ఒక మంచి మాస్ హిట్ అందుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు. కెరీర్ లో హిట్ల కన్నా ఫ్లాపుల సంఖ్య ఎక్కువగా ఉన్నా సరే తనదైన సినిమాలతో అలరించేందుకు వస్తున్న నితిన్ రాబోయే రెండు సినిమాలతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి నాని కాదన్న తమ్ముడు నితిన్ కు లక్ కలిసి వచ్చేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.