Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ - బన్నీ.. మధ్యలో మరో హీరో?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాను త్వరగా పూర్తి చేయాలి అని టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 9:00 AM GMT
త్రివిక్రమ్ - బన్నీ.. మధ్యలో మరో హీరో?
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాను త్వరగా పూర్తి చేయాలి అని టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. మహేష్ బాబు తో చేస్తున్న మూడో సినిమా కావడంతో మార్కెట్లోనే కాకుండా ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ అయితే ఉంది. తప్పకుండా సినిమా సంక్రాంతి పోటీలో మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ కూడా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది.


అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో మరోసారి కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అల్లు అర్జున్ తో సినిమాను వెంటనే మొదలుపెట్టాలని కూడా అనుకున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా అయిపోగానే రెండు నెలల గ్యాప్ తీసుకుని బన్నీ 22వ ప్రాజెక్టు కోసం త్రివిక్రమ్ దర్శకత్వం వహించాలని అనుకున్నాడు.

అయితే ఆ సమయానికి అల్లు అర్జున్ కాస్త బిజీగా కనిపించే అవకాశం ఉంది. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు కొంత ఆలస్యంగా కొనసాగుతూ ఉండటం వలన బన్నీ డేట్స్ దొరక్కపోవచ్చు అని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాను 2024 ఆగస్టు కి విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా విడుదలయ్యేలోపే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా మొదలు కావాల్సింది.

కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ వలన ఆ కాంబినేషన్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక త్రివిక్రమ్ సమయం వృధా చేయకుండా ఇప్పుడు మరొక హీరోతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గతంలో నితిన్ తో కూడా అఆ.. అనే సినిమాను వేగంగా ఫినిష్ చేసి మంచి సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు అదే తరహాలో నేచురల్ స్టార్ నానిని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఇది నిజమైతే నానికి మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎక్కువగా కొత్త దర్శకులతో మీడియా రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ వస్తున్న నాని త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేస్తే మాత్రం అతని మార్కెట్ స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దసరా సినిమాతో 100 కోట్ల మార్కెట్ను చూసిన నాని త్రివిక్రమ్ తో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకుంటాడు అని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు నిజమవుతుందో.