Begin typing your search above and press return to search.

నాని కోసం మెగా డైరెక్టర్ కూడా..?

దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మూవీ చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 July 2023 4:49 AM GMT
నాని కోసం మెగా డైరెక్టర్ కూడా..?
X

నేచురల్ స్టార్ నాన్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ తన ఇమేజ్ మరింత పెంచుకున్నారు. ఎక్కువగా భారీ బడ్జెట్, యూనివర్శల్ కాన్సెప్ట్ లవైపు ఆసక్తి చూపిస్తున్నాడు. అతని కెరియర్ లో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్లీన్ ఇమేజ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ అయిపోయాడు. ఈ కారణంగా నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరు టాలీవుడ్ లో ఉంది. ఈ ఏడాది దసరా మూవీతో సాలిడ్ సక్సెస్ ని నాని తన ఖాతాలో వేసుకున్నారు.

ఆ మూవీతో శ్రీకాంత్ ఓదెలని దర్శకుడిగా నాని పరిచయం చేశారు. ప్రస్తుతం హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీని తర్వాత వివేక్ ఆత్రేయతో మూవీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే ఈ సారి సింపుల్ ఎంటర్టైనర్ కాకుండా యాక్షన్ కథతో ఈ మూవీ చేయనున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మూవీ చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాతో చాలా కాలం తర్వాత టాలీవుడ్ లోకి మోహన్ రాజా అడుగుపెట్టారు. తమిళంలో అతనికి ఎక్కువ సక్సెస్ లు ఉన్నాయి.

కింగ్ నాగార్జునతో మోహన్ రాజా నెక్స్ట్ తెలుగు మూవీ ఉంటుందని చాలా కాలం నుంచుజి వినిపిస్తోన్న మాట. నాగార్జున 100వ సినిమా ఈ దర్శకుడు చేస్తాడని టాక్. అయితే ఇంతలో మరో మూవీ కంప్లీట్ చేయాలని మోహన్ రాజా అనుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా నానికి ఒక కథ చెప్పారంట. అది అతనికి పెద్దగా నచ్చకపోవడంతో మరల సెకండ్ టైం ఇంకో కథని కూడా నేరేషన్ ఇచ్చారంట.

ఈ కథని నాని లాక్ చేసినట్లు తెలుస్తోంది. మోహన్ రాజా అంటే స్టైలిష్ మేకింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు. అలాంటి దర్శకుడితో మూవీ అంటే కచ్చితంగా పక్కా కమర్షియల్ లెక్కల ప్రకారం ఉంటుంది. అలాగే నానికి కూడా కెరియర్ పరంగా మరింత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.