Begin typing your search above and press return to search.

నిజంగా నాని చాలా లక్కీ భయ్యా...!

ప్రతి హీరోకి కెరీర్‌ లో ఒక ప్రత్యేకమైన సినిమా ఉంటుంది. ఆ సినిమా చేయడం వల్ల నా జీవితం ధన్యం అయింది అన్నంతగా ఆ సినిమా ను అభిమానిస్తూ ఉంటారు

By:  Tupaki Desk   |   21 April 2024 7:56 AM GMT
నిజంగా నాని చాలా లక్కీ భయ్యా...!
X

ప్రతి హీరోకి కెరీర్‌ లో ఒక ప్రత్యేకమైన సినిమా ఉంటుంది. ఆ సినిమా చేయడం వల్ల నా జీవితం ధన్యం అయింది అన్నంతగా ఆ సినిమా ను అభిమానిస్తూ ఉంటారు. నాని కెరీర్‌ లో అలాంటి సినిమా 'జెర్సీ' అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాని అనుకున్నా అనుకోకున్నా ఆయన ఫ్యాన్స్ మాత్రం అనుకుంటారు.

నిజంగా నానికి జెర్సీ సినిమా చాలా ప్రత్యేకం. కమర్షియల్‌ ఎలిమెంట్స్ గురించి పట్టించుకోకుండా, తన ఇమేజ్ ను పక్కన పెట్టి నాని చేసిన జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నాని నటనకు ఒక మైళు రాయి అన్నట్లుగా నిలిచింది.

నాని జెర్సీ సినిమా విడుదల అయ్యి ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ లో ఓ థియేటర్‌ లో నాని కుటుంబ సమేతంగా జెర్సీ సినిమాను అభిమానులతో కలిసి చూశాడు. ఆ సమయంలో వచ్చిన స్పందన చూసి కచ్చితంగా నాని కూడా అవాక్కయ్యే ఉంటాడు.

సినిమా స్క్రీనింగ్‌ అవుతున్నంత సమయం కూడా ఫ్యాన్స్‌ డైలాగ్స్ ను ముందే చెప్పేయడం, కొన్ని సన్నివేశాల్లో లేచి నిల్చుని చప్పట్లు కొట్టడం ఇలా ఎన్నో భావోద్వేగాలతో జెర్సీ సినిమా రీ రిలీజ్ హంగామా సాగింది. వాటన్నింటిని కూడా నాని ప్రత్యక్షంగా చూసి సంతోషించాడు.

జెర్సీ వంటి సినిమాను చేసినందుకు నాని చాలా లక్కీ అంటూ ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులు మరోసారి మాట్లాడుకోవడం జరిగింది. జెర్సీ సినిమా మరో పదేళ్లు ఇరవై ఏళ్లు అయినా కూడా చాలా ఫ్రెష్‌ గా ఉంటుందని, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, అలాంటి సినిమా చేసిన నాని నిజంగా లక్కీ.