Begin typing your search above and press return to search.

కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో నాని.. మరో సూపర్ కమిట్మెంట్

ఈ చిత్రం కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్.

By:  Tupaki Desk   |   11 Feb 2024 12:04 PM GMT
కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో నాని.. మరో సూపర్ కమిట్మెంట్
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టైర్-2 హీరో ఇమేజ్ నుంచి స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే పనిలో ఉన్నారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. గత ఏడాది నాని నుంచి వచ్చిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే ఈ సినిమా తర్వాత నాని ఎవరితో నెక్స్ట్ మూవీ చేస్తారన్నది ఇంకా సస్పెన్సే. కానీ లైన్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. శైలేష్ కొలను హిట్-3తో పాటు సుజిత్, శ్రీకాంత్ ఓదెల, వేణుతో నాని జట్టు కడతారని వార్తలు వస్తున్నాయి.

అయితే శైలేష్, సుజిత్, శ్రీకాంత్ తో సినిమాలన్నీ భవిష్యత్తులో ఉండొచ్చు కానీ.. వాటి కంటే ముందు నాని.. బలగం ఫేమ్ వేణు యెల్దండి సినిమానే పట్టాలెక్కించబోతున్నారట. నాని- వేణుల కలయికలో మూవీ ఉండొచ్చని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు సమాచారం. వేణు ఇటీవలే స్టోరీ నరేట్ చేయగా.. దాన్ని సరిపోదా శనివారం తర్వాత వెంటనే చేయడానికి నాని ఓకే చెప్పేశాడట.

వేణుతో బలగం తీసి పెద్ద ఎత్తున లాభాలు సంపాదించిన నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారట. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తానేంటో రుజువు చేసుకోవాలనుకుంటున్నారట వేణు. మరోవైపు, నానికి దిల్ రాజు బేనర్లో ఎంసీఏ లాంటి పెద్ద హిట్ ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.

ఇదిలా ఉంటే, బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్న నాని.. ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ దశలో ఉన్నట్లు చెప్పవచ్చు. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు కంటిన్యూగా టాప్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఒట్టో, స్ప్రైట్, మినిట్ మెయిడ్ తోపాటు ఇతర బ్రాండ్‌ లను ప్రమోట్ చేస్తున్న నాని.. ఇప్పుడు క్లోజ్ అప్ టూత్ పేస్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీంతో మొత్తానికి నాని.. వరుసగా అగ్రిమెంట్లపై సైన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఆల్ ది బెస్ట్ నాని!!