Begin typing your search above and press return to search.

నాని 'హిట్-3' కేస్ 2024 లోనా?

'హిట్' ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. శైలేష్ కొల‌ను దర్శ‌కత్వం వ‌హించిన ఈ సిరీస్ కి మార్కెట్ లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 5:30 PM GMT
నాని హిట్-3 కేస్ 2024 లోనా?
X

'హిట్' ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. శైలేష్ కొల‌ను దర్శ‌కత్వం వ‌హించిన ఈ సిరీస్ కి మార్కెట్ లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో నిర్మాత‌గా ఉన్న నాని నే థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కోసం హీరోగా మారిపోయాడు. మూడ‌వ‌భాగంలో నాని పాత్ర ఎంత ర‌ఫ్ గా ఉంటుందో కూడా క్లైమాక్స్ లో రివీల్ చేసారు. అర్జున్ స‌ర్కార్ అనే బ్రూట‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నాని క‌నిపించ‌బోతున్నాడు.

సాధార‌ణంగా 100 మంది దోషులైనా త‌ప్పించుకోవ‌చ్చు. కానీ ఒక నిర‌ప‌రాధి శిక్షించ‌బ‌డ‌కూడ‌ద‌నేది మ‌న చ‌ట్టం. కానీ అర్జున్ స‌ర్కార్ పాల‌సీ అందుకు విరుద్ధం. ఇంత‌టి బ్రూట‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌ని హిట్ ది థ‌ర్డ్ కేస్‌లో ఫేస్ చేయ‌బోయే క్రిమిన‌ల్ మ‌రి ఇంకెంత క్రూయ‌ల్‌గా ఉంటారో? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి హిట్ -3పై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.

పెద్ద పెద్ద స్టార్లు పేర్లు ఈ సిరీస్ లో విన‌బ‌డుతున్నాయి. హిట్ -2 ని న‌ట‌సింహ బాల‌కృష్ణ త‌న‌య‌డు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి చూసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో బాల‌య్య ఈ సిరీస్ పై చాలా ఆస‌క్తిగా క‌నిపించారు. దీంతో ఒకానొక‌ద ద‌శ‌లో బాల‌య్య పోలీస్ గెట‌ప్ వేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని సైతం ప్ర‌చారం సాగింది. అలాగే ఓ కీల‌క మైన పాత్ర‌కు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ని కూడా ప‌రిశీలిస్తు న్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

కానీ ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ పేరు అధికారికంగా తెర‌పైకి రాలేదు. అయితే 2024 లో ఈ స‌స్పెన్స్ కి ఎండ్ కార్డ్ ప‌డే అవ‌కాశం ఉంది. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న 'సైంధ‌వ్' సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అటుపై ఆయ‌న ప్రీ అయిపోతాడు. అలాగే నాని న‌టిస్తోన్న 'స‌రిపోదా శ‌నివారం' కూడా స‌గం షూటింగ్ పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో 'హిట్ -3'ని నాని రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించడానికి స్కోప్ ఉంటుంది.