Begin typing your search above and press return to search.

హాయ్ నాన్నకు ఎన్ని సవాళ్ళో..

ఇన్ని అడ్డంకులని దాటుకొని నాని ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించాలంటే కంటెంట్ లో దమ్ముండాలి.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:16 AM GMT
హాయ్ నాన్నకు ఎన్ని సవాళ్ళో..
X

ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్స్ చాలా ముఖ్యం. వీటి కోసంమే కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ డే ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడమే పెద్ద చాలెంజింగ్ టాస్క్ గా మారింది. దానికోసం నెల రోజుల నుంచి హీరోలు ప్రమోషన్స్ పైన పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నానికి ఓ వైపు యూత్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి ఇమేజ్ ఉంది.

నాని సినిమా అంటే మొదటి రోజే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడటానికి రెడీ అయిపోతారు. దసరా లాంటి మాస్ మూవీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఆ సినిమాతో నాని బ్లాక్ బస్టర్ కొట్టారు. తాజాగా హాయ్ నాన్న మూవీతో డిసెంబర్ 7న నాని థియేటర్స్ లోకి రాబోతున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ డ్రామాగా ఉండబోతోందని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. మొదటి వారంలో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ హిట్ అయితే మాత్రం హిందీలో నాని సినిమాపైన కొంత ఎఫక్ట్ పడే అవకాశం ఉంది. తెలుగులో కూడా యానిమల్ సక్సెస్ రేంజ్ బట్టి హాయ్ నాన్నపై కొంత ప్రభావం ఉంటుంది.

ఇక హాయ్ నాన్న మూవీ రిలీజ్ తర్వాత రోజు నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా నుంచి హాయ్ నాన్నకి కొంత ప్రతిబంధకం ఉంటుంది. ఇన్ని అడ్డంకులని దాటుకొని నాని ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించాలంటే కంటెంట్ లో దమ్ముండాలి.

కొత్త దర్శకులతో నాని చేసిన సినిమాలు అన్ని కూడా ఇంచు మించు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హాయ్ నాన్న మీద కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. మృణాల్ ఠాకూర్ లేకపోయిన సోలోగా మూవీ ప్రమోషన్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. భారం అంతా తనపై వేసుకొని జనాల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం నాని చేస్తున్నారు.