Begin typing your search above and press return to search.

నానితో వచ్చిన కొత్త దర్శకులు.. ఎంతమందంటే!

సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో పని చేయాలంటే హీరోలకు చాలా గట్స్ కావాలి. అనుభవమున్న డైరెక్టర్ తో పని చేస్తే ఆ హీరోకి కచ్చితంగా హిట్ గ్యారెంటీ

By:  Tupaki Desk   |   8 Dec 2023 3:30 PM GMT
నానితో వచ్చిన కొత్త దర్శకులు.. ఎంతమందంటే!
X

సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో పని చేయాలంటే హీరోలకు చాలా గట్స్ కావాలి. అనుభవమున్న డైరెక్టర్ తో పని చేస్తే ఆ హీరోకి కచ్చితంగా హిట్ గ్యారెంటీ. అదే డెబ్యూ డైరెక్టర్ తో వర్క్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ముందే చెప్పలేం. అందుకే చాలామంది స్టార్ హీరోలు సేఫ్ సైడ్ గా అనుభవమున్న స్టార్ డైరెక్టర్ తోనే తోనే పని చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం కొత్త దర్శకులతో పనిచేసేందుకు ఇష్టపడతారు.

అలాంటి వారిలో న్యాచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉంటాడు. నాని ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 సంవత్సరాలు కావస్తోంది. ఈ 15 ఏళ్లలో నాని పలువురు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆ దర్శకులతో సినిమా చేసి మంచి రిజల్ట్ అందుకున్నాడు. కేవలం హీరో గానే కాదు నిర్మాతగా కూడా యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించిన ఏకైక హీరో నాని కావడం విశేషం. ఇంతకీ నాని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొత్త డైరెక్టర్స్ ఎవరు అనే విషయానికొస్తే..

కెరీర్ స్టార్టింగ్ లో నాని నటించిన 'అలా మొదలైంది' మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో నందిని రెడ్డి దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో నాగ్ అశ్విన్ ని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాని. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ అనే డెబ్యూ డైరెక్టర్ తో 'నిన్ను కోరి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఇక హీరో గానే కాకుండా నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడితో 'అ:' అనే డిఫరెంట్ మూవీ తో నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో 'హిట్' సినిమాని నిర్మించాడు. ఈ మూవీతో శైలేష్ కొలను వెండితెరకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'హిట్ 2' కూడా మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది.

త్వరలో నాని లీడ్ రోల్ లో 'హిట్ 3' కూడా ఉండబోతుంది. ఇక గత ఏడాది 'దసరా' సినిమాతో మొదటి పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్నాడు నాని. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇక తాజాగా విడుదలైన 'హాయ్ నాన్న' మూవీతో మరో మరో డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు నాని. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అలా ఇప్పటివరకు కొత్త దర్శకులతో పని చేసిన నాని సినిమాలన్నీ దాదాపు మంచి రిజల్ట్ ని అందుకోవడం విశేషం.