Begin typing your search above and press return to search.

నాని చెప్పిన ఆ సీక్రెట్ ఏంటి అంటే?

నాని చేస్తున్న సినిమా పాత్ర కోసం ఎంతసేపు రిహార్సల్స్ చేస్తాడు. నాని క్యారెక్టర్ కోసం హోం వర్క్ ఎలా ఉంటుంది లాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:20 AM GMT
నాని చెప్పిన ఆ సీక్రెట్ ఏంటి అంటే?
X

న్యాచురల్ స్టార్ నాని తన సహజ నటనతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు. అష్టా చమ్మా సినిమా నుంచి ఈ ఇయర్ మార్చిలో వచ్చిన దసరా సినిమా వరకు ఎలాంటి పాత్ర అయినా సరే నాని తన నటనతో మెప్పించేస్తాడు. నానిలా పాత్రకు తగినట్టుగా సహజమైన నటనతో ఆకట్టుకోవడం చాలా కష్టం. అందుకే అతనికి న్యాచురల్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. అయితే సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుస్తున్న నాని తన యాక్టింగ్ సీక్రెట్ ఏంటని అడిగితే మాత్రం షాకింగ్ ఆన్సర్ ఇస్తున్నాడు.

నాని చేస్తున్న సినిమా పాత్ర కోసం ఎంతసేపు రిహార్సల్స్ చేస్తాడు. నాని క్యారెక్టర్ కోసం హోం వర్క్ ఎలా ఉంటుంది లాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. సెట్ లోకి వెళ్ళాక డైరెక్టర్ తో షూట్ చేయాల్సిన సీన్ గురించి 20 నిమిషాలు డిస్కస్ చేస్తా అంతే డైరెక్టర్ ఇన్ పుట్స్ తీసుకుని ఎలా చేయాలో చర్చిస్తా అదే అక్కడ మ్యాజిక్ చేస్తుందని అన్నారు నాని. సీన్ ఏదైనా ఇన్ స్టంట్ గా చేసినప్పుడు మాత్రమే అది బాగుంటుందని హోం వర్క్ చేయడం వల్ల పాత్రలో ఉన్న ఎమోషన్ తగ్గిపోతుందని నాని అన్నారు.

ఒక సీన్ గురించి ఎక్కువ ఆలోచించాలి.. ఎక్కువ హోం వర్క్ చేయాలని చాలామంది చెబుతుంటారు. కానీ తనకు అలా చేస్తే ఎమోషన్ మిస్ అవుతుందని అన్నారు. దీనికి ఉదాహరణగా జీవితంలో ఏదైనా చెడు జరిగితే 2 రోజుల తర్వాత ఆ బాధ తగ్గుతుంది. మొదటి రోజు ఉన్నంత బాధ ఉండదని అన్నారు. అలానే ఒక సీన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే సరిగా నటించలేం అన్నది తన ఆలోచన అని చెప్పారు.

ఈ క్రమంలోనే మెథడ్ యాక్టింగ్ మీద తన కామెంట్ చేశారు నాని. కొంతమంది తాము చేసిన పాత్రల్లో అలా ఉండిపోయామని అంటారు. అలా ఎలా సాధ్యపడుతుందో తనకు అర్థం కాదు. యాక్షన్ చెప్పినప్పుడు నటించాలి ఆ తర్వాత రిలాక్స్ అవ్వాలి పాత్రలో అలా రోజంతా ఎలా ఉంటారో తనకు తనకు తెలియదని అన్నారు. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటో కూడా తనకు తెలియదని అది ఇప్పటికీ తనకు అర్థం కాదని అన్నారు నాని. నాని నటించిన హాయ్ నాన సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాని స