Begin typing your search above and press return to search.

హిట్ 3 ని పక్కన పెట్టిన నాని!

తన నెక్స్ట్ సినిమా హిట్ 3 నే అన్నట్టుగా చేసిన నాని ఇప్పుడు ఆ సినిమా చేయడానికి టైం లేదని చెబుతున్నాడట. హిట్ 1, 2 సినిమాలు నానినే నిర్మించాడు. మన సినిమానే కదా ఎప్పుడైనా చేసేయొచ్చు అనే ఆలోచనతో నాని ఉన్నట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   19 July 2023 6:02 AM GMT
హిట్ 3 ని పక్కన పెట్టిన నాని!
X

నేచురల్ స్టార్ నాని దసరా తర్వాత తన నెక్స్ట్ సినిమా హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ ఫిక్స్ చేశాడు. క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ కలిసి వచ్చేలా తన సినిమా దించుతున్నాడు నాని. నాని కేవలం ఇలాంటి పాత్రలే చేయగలడు అతనికి మాస్ సినిమాలు చేయడం రాదు అనుకున్న వారికి దసరా సినిమాతో పెద్ద షాక్ ఇచ్చాడు. ధరణి పాత్రలో నాని చూపించిన అభినయం కొత్త ఫ్యాన్స్ ని ఏర్పరచేలా చేసిందని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా సినిమాకు ప్రాణం పెట్టి చేశాడు కాబట్టే నాని ఆ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత నాని హాయ్ నాన్న అంటూ మళ్లీ తన రెగ్యులర్ ఫార్మెట్ లో ఎమోషనల్ కంటెంట్ తో సినిమా చేస్తున్నాడు. హాయ్ నాన్న సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించడం సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ వివేక్ తో అంటే సుందరానికీ సినిమా చేశాడు నాని. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. అయితే వివేక్ టాలెంట్ కి సరైన కమర్షియల్ హిట్ పడట్లేదని అతనికి మరో ఛాన్స్ ఇచ్చాడు నాని.

అంతా బాగానే ఉంది కానీ నాని హీరోగా హిట్ ఫ్రాంచైజ్ లో చేయాల్సిన హిట్ 3 గురించి నాని పట్టించుకోవట్లేదు. హిట్ 1 లో విశ్వక్ సేన్, హిట్ 2 లో అడివి శేష్ హీరోలుగా నటించి సక్సెస్ అందుకున్నారు. హిట్ 3 సినిమా నాని చేస్తున్నాడు. హిట్ 2 లో నాని సర్ ప్రైజ్ ఆడియన్స్ ని మెప్పించింది. తన నెక్స్ట్ సినిమా హిట్ 3 నే అన్నట్టుగా చేసిన నాని ఇప్పుడు ఆ సినిమా చేయడానికి టైం లేదని చెబుతున్నాడట. హిట్ 1, 2 సినిమాలు నానినే నిర్మించాడు. మన సినిమానే కదా ఎప్పుడైనా చేసేయొచ్చు అనే ఆలోచనతో నాని ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే హిట్ ఫ్రాంచైజ్ లకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అలాంటిది హిట్ 3కి మరీ ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం వారు కూడా దాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. హిట్ డైరెక్టర్ శైలేష్ ప్రస్తుతం వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక హిట్ 3 ని సెట్స్ మీదకు తీసుకెళ్తే నెక్స్ట్ ఇయర్ హిట్ 3 ఉన్నట్టు లెక్క లేదంటే మాత్రం హిట్ 3 ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదని ఫిక్స్ అవ్వొచ్చు. మరి నాని అండ్ టీం హిట్ 3 విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.