Begin typing your search above and press return to search.

NANI 31: మరో క్రేజీ కాంబో షురూ

ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వివేక్ ఆత్రేయ మళ్ళీ నానితోనే కొత్త మూవీ స్టార్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 7:39 AM GMT
NANI 31: మరో క్రేజీ కాంబో షురూ
X

నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వివేక్ ఆత్రేయ మళ్ళీ నానితోనే కొత్త మూవీ స్టార్ట్ చేశారు. ఈ సారి లవ్ స్టొరీ కాకుండా డిఫరెంట్ జోనర్ కథని వివేక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

హాయ్ నాన్న మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండటంతో నేచురల్ స్టార్ నాని ఈ సినిమాని ఈ మూవీ షూటింగ్ కి రెడీ అయిపోయాడు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక మేకప్ టెస్ట్ షూట్ వీడియో రిలీజ్ చేసి మూవీ రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ నెల 23న సినిమా పూర్తి డీటెయిల్స్ ఎనౌన్స్ చేయడంతో పాటు 24న ముహూర్తం షూటింగ్ తో ప్రారంభోత్సవం జరిగిందని కన్ఫర్మ్ చేశారు. ఈ సారి నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో సరికొత్త కథ రాబోతోందని ఈ ట్రైల్ వీడియో బ్యాగ్రౌండ్ స్కోర్ బట్టి తెలుస్తోంది. అలాగే మునుపెన్నడూ చూడని విధంగా నానిని ఈ చిత్రంలో వివేక్ ఆత్రేయ చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

NANI31 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ అండ్ క్రూ గురించి పూర్తి వివరాలు 24న తెలిసే అవకాశం ఉంది. అలాగే మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతోందా లేదంటే కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం అవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇప్పటి వరకు వివేక్ ఆత్రేయ మూడు సినిమాలు చేయగా అందులో లవ్ స్టొరీతో పాటు సింపుల్ కామెడీని మిక్స్ చేసి కథలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు నాని సినిమా ద్వారా తనలోని కమర్షియల్ డైరెక్టర్ ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.