ఫ్రెండ్ సినిమాని సపోర్ట్ చేస్తున్న నాని
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Jun 2025 1:57 PM ISTఏ హీరో హీరోయిన్ అయినా కలిసి కనిపించేది ఆ సినిమా రిలీజ్ వరకే. రిలీజ్ టైమ్ లోనే ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ, ఒకరినొకరు ప్రశంసించుకుంటూ క్లోజ్ గా కనిపిస్తారు. ఎప్పుడైతే ఆ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోతుందో ఆ తర్వాత తమ తమ తర్వాతి సినిమా పనుల్లో బిజీ అయిపోతారు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు మాత్రం తమ మధ్య బాండింగ్ వల్ల ఆ సినిమా, ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ టచ్ లో ఉంటూ ఉంటారు.
అలాంటి వారిలో టాలీవుడ్ హీరో నాని, కీర్తి సురేష్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి నేను లోకల్, దసరా అనే సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాల్లో వారి కెమిస్ట్రీకి అందరి నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ రెండు సినిమాల టైమ్ లో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ కారణంగానే ఇప్పటికీ వారు రెగ్యులర్ గా ఒకరి సినిమాలను ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జులై 4న ఈ సినిమా ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రీసెంట్ గానే మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని ఆ ట్రైలర్ ను చూసి దానిపై ఓ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో ఉప్పు కప్పురంబు ట్రైలర్ చాలా సరదాగా, విచిత్రంగా ఉందని, ట్రైలర్ లో మా కీర్తి చాలా అమాయకంగా, ఛార్మింగ్ గా ఉందని, సుహాస్ మరియు మిగిలిన వాళ్లు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారని, ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని, డైరెక్టర్ అని శశికి మరియు చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని రాసుకొచ్చారు నాని. అతని పోస్ట్ కు కీర్తి సురేష్ స్పందిస్తూ, థాంక్యూ నాని, ఈ సినిమా మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నానంటూ రిప్లై ఇచ్చింది. తన ఫ్రెండ్ నుంచి ఓ మంచి సినిమా వస్తుందని, ఆమెను, ఆమె సినిమాను ఎంకరేజ్ చేస్తూ దాని గురించి తోటి ఫ్రెండ్ గా ఉప్పు కప్పురంబు పై నాని చేసిన పోస్ట్, దానికి కీర్తి రెస్పాండ్ అవుతూ ఇచ్చిన రిప్లై అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి స్నేహానికి అందరూ ముగ్దులవగా, నాని పోస్ట్ తో ఉప్పు కప్పురంబు సినిమాకు ఇంకొంచెం బజ్ పెరిగింది.
